పొదల్లో అపస్మారక స్థితిలో డిగ్రీ యువతి వీడియోను చూశారా..? దీని వెనుక అసలు కథేంటో తేల్చేసిన పోలీసులు

పొదల్లో అపస్మారక స్థితిలో డిగ్రీ యువతి (ఫైల్ ఫొటో)

రోడ్డు పక్కనే కాళ్లూ చేతులు కట్టేసిన స్థితిలో పొదల్లో ఓ యువతి పడి ఉంది. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయింది.

 • Share this:
  విజయనగరం జిల్లా. గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అపస్మారక స్థితిలో ఓ యువతి. రోడ్డు పక్కనే కాళ్లూ చేతులు కట్టేసిన స్థితిలో పొదల్లో ఓ యువతి పడి ఉంది. అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు స్పందించి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అయింది. డిగ్రీ చదువుతున్న ఆ యువతిని ఎవరో కిడ్నాప్ చేశారనీ, ఆమెపై దాడి చేసి రోడ్డు పక్కన పడేశారనీ వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిందిస్తూ పోస్టులు పెట్టడంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు. ఆ యువతి కోలుకున్న తర్వాత ఆమెను విచారించారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలో ఓ యువతి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు దొరికిపోయినట్టే.. ఈ ఘటనలోనూ యువతి తప్పుడు సమాధానాలు చెప్పి అడ్డంగా బుక్కయ్యింది.

  హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుకుంటున్న ఈ యువతి హాస్టల్లో ఉంటోంది. మా బాబాయి ఇంటికి వెళ్తున్నానంటూ ఫిబ్రవరి 27వ తారీఖున హాస్టల్లో పర్మిషన్ అడిగి బయటకు వెళ్లింది. అయితే ఆమె బాబాయి ఇంటికి వెళ్లకుండా తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆమె అన్నయ్య హాస్టల్ కు ఫోన్ చేసి ’మా చెల్లి ఉందా.. ఒకసారి ఫోన్ ఇవ్వండి‘ అని అడిగాడు. అయితే ’బాబాయి ఇంటికి వెళ్తానని పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లింది‘ అని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు. ఈ విషయం కాస్తా ఆ యువతికి తెలిసింది. దీంతో బాబాయికి ఫోన్ చేసి అన్నయ్య వివరాలు కనుక్కుంటాడనీ, తాను వెళ్లలేదన్న నిజం తెలిసిపోతుందని ఆ యువతికి భయం పట్టుకుంది.
  ఇది కూడా చదవండి: ఒక్క ఘటనతో వరుడికి డబుల్ షాక్స్.. తెల్లవారుజామున వధువును తీసుకెళ్లిన తాత.. చివరకు సీన్ రివర్స్

  ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు వెంటనే ఓ భారీ ప్లాన్ కు తెరలేపింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కి గుర్ల దాటిన తర్వాత బస్సును దిగింది. అక్కడి నుంచి కాస్త నడుచుకుంటూ వచ్చింది. అక్కడే తనను తాను బంధించుకుని రోడ్డు పక్కన తుప్పల్లో అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా పడిపోయింది. అయితే అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్న యువతిని గుర్తించారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె బంధీగా ఉన్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ కావడం, తీవ్ర విమర్శలు కూడా వ్యక్తం అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘనటపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అనుమానాస్పదంగా ఎవరూ కనిపించకపోవడంతో ఆమెను విచారించారు. పోలీసుల ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన యువతి, అసలు నిజాన్ని ఒప్పుకుంది. తానే కట్టు కథ అల్లానని చెప్పింది.
  ఇది కూడా చదవండి: రోజుల గ్యాప్ లోనే వరుస ఘటనలు.. ప్రపంచం అంతానికి ఇవే చివరి సూచనలు.. 2021లో ఏం జరగబోతోందో ముందే చెప్పిన నోస్ట్రడామస్..!
  Published by:Hasaan Kandula
  First published: