Home /News /andhra-pradesh /

SHOCKING INCIDENT HAPPENED IN WEST GODAVARI AS MAN FOUND DEAD WITH OUT HEAD FULL DETAILS HERE PRN

Shocking: రాత్రి పొలంలోనే పడుకున్నాడు.. ఉదయాన్నే మంచంపై షాకింగ్ దృశ్యం.. ఆ రాత్రి ఏం జరిగింది..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

West Godavari: అతడో సాధారణ రైతు. వ్యవసాయం, గొర్రెలు మేపుకోవడమే అతడి జీవనోపాధి. పగలు ప్రతీకారాల వంటివాటికి దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాడు. ఎప్పటిమాదిరిగానే పొలం వెళ్లి రాత్రి పూట గొర్రెలకు కాపలాగా పడుకున్నాడు. కానీ ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులకు షాకింగ్ దృశ్యం కనిపించింది.

ఇంకా చదవండి ...
    అతడో సాధారణ రైతు. వ్యవసాయం, గొర్రెలు మేపుకోవడమే అతడి జీవనోపాధి. పగలు ప్రతీకారాల వంటివాటికి దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతంలో ఉంటున్నాడు. ఎప్పటిమాదిరిగానే పొలం వెళ్లి రాత్రి పూట గొర్రెలకు కాపలాగా పడుకున్నాడు. కానీ ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులకు షాకింగ్ దృశ్యం కనిపించింది. తల లేకుండా కేవలం మొండెం మాత్రమే మంచంపై ఉంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari) బుట్టాయగూటెం మండలం జగ్గిసెట్టిగూడెం గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తి.. బుధవారం రాత్రి తన పొలంలో మేకల మందకు కాపలాగా ఉండేందుకు వెళ్లాడు. రాత్రి అక్కడే నిద్రపోయాడు. ఐతే అర్ధరాత్రి పొలంలోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. ఏకంగా తలను నరికేసి తీసుకెళ్లిపోయారు.

    ఉదయం మంచంపై పడి ఉన్న పర్వతాలు మొండెం ను చూసి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. క్లూజ్ టీమ్ ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. కాగా పర్వతాలుకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. పర్వతాలు ఇంట్లో కుటుంబ కలహాలేమైనా ఉన్నాయే అనే కోణంలో భార్యపిల్లల దగ్గర పోలీసులు వివరాలు తెలుసుకున్నారు.

    ఇది చదవండి: భోజనం చేస్తుంటే చూశాడని చావబాదాడు.. ఇదేం గొడవరా బాబు..!


    అలాగే గ్రామంలో ఎవరికైనా తగాదాలున్నాయనే అనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. వచ్చింది మేకల దొంగలే అయితే దారుణంగా తలను నరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. పాత కక్షలు, ఇతర వ్యవహారాల్లో శత్రువులే ఇలా చేసి ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. హత్య జరిగిన తీరును విశ్లేషించిన పోలీసులు తల కోసం గాలిస్తున్నారు. ఇలాగే గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తుల కదలికలున్నాయా అనే వివరాలను సేకరిస్తున్నారు.

    ఇది చదవండి: భర్తను వదిలేసి ప్రియుడే లోకమనుకుంది.. కానీ అంతలోనే ఊహించని పరిణామం..


    ఇటీవల కడప జిల్లా (Kadapa District) లో ఇలాంటి ఘటనే జరిగింది. రామాపురం మండలం సుండుపల్లి సమీపంలో ఓ మహిళ మృతదేహం సంగం కాలిన స్థితిలో కనిపిచడం కలకలం రేగింది. అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు సాగించారు. మృతహేదం రాయచోటికి చెందిన పూదోట కళావతిగా గుర్తించి ఆమెకు ఆమెకు గురవయ్య అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలుసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. ఆమెను హత్య చేసి ఎత్తుకెళ్లిన బంగారు నగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడ్ని రిమాండ్ కు తరలించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Murder, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు