• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • SHOCKING INCIDENT HAPPENED IN PRAKASHAM DISTRICT OF ANDHRA PRADESH THAT 7 FEET SNAKE FOUND IN LED TV PANEL BOARD HERE ARE THE DETAILS PRN GNT

Andhra Pradesh: ఎల్ఈడీ టీవీ నుంచి పొగలు.. ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ దృశ్యం

Andhra Pradesh: ఎల్ఈడీ టీవీ నుంచి పొగలు.. ఓపెన్ చేసి చూస్తే షాకింగ్ దృశ్యం

ఫ్రకాశం జిల్లా గిద్దలూరులో టీవీలో దూరిన పాము

Snake in LED TV: వేలకు వేలు పోసి కొన్న టీవీ పనిచేయకపోవడంతో ఆ యజమాని టీవీ మెకానిక్ దగ్గరకు తీసుకొచ్చాడు. రిపేర్ చేద్దామని టీవీని ఓపెన్ చేసిన సదరు మెకానిక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు.

  • Share this:
    ఒక్కోసారి మనకి షాకింగ్ ఘటనలు ఎదరవుతుంటాయి. మన చేతులతో మనమే ప్రమాదపుటంచుల వరకు వెళ్లొస్తుంటాం. అసలు విషయం తెలిసినా వామ్మో అలా జరిగిందా..? అని మనకు మనమే అనుకుటుంటాం. అలాంటి ఘటనలో ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఓ ఇంట్లోకి పెద్ద పాము వచ్చింది. ఇళ్లలో అది పడుకోవడానికి పుట్టలు, పొదలు ఉండవకదా..? అటు ఇటూ చూసి ఇదేదో రంగురంగులుగా మెరుస్తోంది కదా అని టీవీలో దూరేసింది. అంతపెద్ద పాము దూరితే టీవీ పనిచేస్తుందా.. అటకెక్కింది. ఆ తర్వాత మొదలైంది అసలు సీన్. ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట గ్రామానికి చెందిన ఓ ఇంట్లో ప్రముఖ కంపెనీకి చెందిన ఎల్ఈడీ టీవీలో నుంచి ఉన్నట్లుండి పొగలు వచ్చి పనిచేయడం ఆగిపోయింది.

    వేలకు వేలు పోసి కొన్న టీవీ పనిచేయకపోవడంతో ఆ యజమాని టీవీ మెకానిక్ దగ్గరకు తీసుకొచ్చాడు. రిపేర్ చేద్దామని టీవీని ఓపెన్ చేసిన సదరు మెకానిక్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. టీవీ ప్యానెల్ ఓపెన్ చేసి చూడంగా అందులో దాదాపు 10 అడుగుల  పొడవైన పాము ఉంది. పామును చూసిన భయంతో వణికిపోయాడు. తీరా అది చనిపోయి ఉండటంతో ఊపిరి పీల్చుకున్నాడు. టీవీలో దూరడంతో విద్యుత్ షాక్ కు గురై అది చనిపోయినట్లు గుర్తించాడు. అలాగే పాము కారణంగానే టీవీ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్కూట్ కు గురై మొత్తం కాలిపోయింది.

    ఈ సీన్ చూసిన టీవీ యజమాని కూడా ఒక్కసారిగా కంగుతున్నాడు. ఇంట్లో ఉన్న టీవీలో పాము ఎలా దూరిందో అర్ధం కాక అయోమయంలో పడ్డాడు. అసలు ఇంట్లో పాము వచ్చిందో తెలియదని చెప్తున్నాడు. అంతేకాదు పామును దూరిన టీవీని తాను తీసుకొచ్చానన్న ఘటనను తలచుకుంటే వెన్నులో వణుకు పుడుతోందని వెల్లడించాడు. మొత్తానికి ప్రశాంతంగా పడుకోవచ్చని టీవీలో దూరిన పాము.., తాను చావడమే కాకుండా.. బంగారంలాటి టీవీని కూడా అటకెక్కించింది.
    Published by:Purna Chandra
    First published: