Home /News /andhra-pradesh /

SHOCKING FACTS REVEALED IN SURVEY AS MOST OF DEATHS CAUSED BY THIS REASON IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK

Andhra Pradesh: ఏపీలో మరణాలకు ప్రధాన కారణం ఇదే.. సర్వేలో షాకింగ్ నిజాలు..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 70 శాతం మ‌ర‌ణాలు ఎలా సంభ‌విస్తోన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 2016 నుంచి 2020 వ‌ర‌కు ఏపీలో మ‌ర‌ణాల‌కు కార‌ణాలు తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. తాజాగా కేంద్ర రావాణా మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన డేటాలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంకా చదవండి ...
    M Bala Krishna, News18, Hyderabad

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 70 శాతం మ‌ర‌ణాలు ఎలా సంభ‌విస్తోన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 2016 నుంచి 2020 వ‌ర‌కు ఏపీలో మ‌ర‌ణాల‌కు కార‌ణాలు తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. తాజాగా దేశంలో రోడ్డు ప్ర‌మాదాల‌పై కేంద్ర రావాణా మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన డేటాలో 70 శాతం మ‌ర‌ణాలుకు గల కార‌ణాలు వెలుగులోకొచ్చాయి. 2016 నుండి 2020 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లపై స్పీడ్ డ్రైవింగ్ కారణంగా మొత్తం 29,285 మంది మరణించారు. ఇలా రోడ్డు ప్ర‌మాదాల్లో ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంక్‌లో నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా అతివేగం కారణంగా మరణాలు ఏపీలో 70 శాతం మ‌ర‌ణాలు సంభ‌వించాయ‌ని ఈ డేటా పేర్కొంటుంది.

    ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల మరణాలలో అధిక సంఖ్యలో అంటే దాదాపు 70 శాతానికి పైగా మరణాలకు అతివేగం ప్రధాన కారణం. 2020లో రాష్ట్రంలో 19,509 రోడ్డు ప్రమాదాలు జ‌రిగాయి, అందులో 7,039 మంది మరణించారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో, అతివేగం కారణంగా రాష్ట్రంలో 14,716 ప్రమాదాలు జరగగా, 5,227 మంది ప్రాణాలు కోల్పోగా, 3,984 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డేటా ప్రకారం, 2016లో ఆంధ్రప్రదేశ్‌లో ఓవర్ స్పీడ్ కారణంగా 5,564 మంది మరణించారు. ఈ సంఖ్య 2017లో 6,768కి పెరిగింది. 2018లో 6,196కి తగ్గింది, 2019లో 5,530కి, మళ్లీ 2020లో 5,227కి పడిపోయింది.

    ఇది చదవండి: ఆ నేత కోసం తగ్గిన చంద్రబాబు.. ఇంటికెళ్లి రెండు గంటలు మీటింగ్..?


    అయితే, అతివేగం కారణంగా మరణాలు 60 నుండి 70 శాతం మధ్య ఉన్నాయి. స్పీడ్ లేజర్ గన్‌లతో ఓవర్‌స్పీడ్ రేష్ డ్రైవింగ్‌ను 24 గంటల్లో తనిఖీ చేయడం అన్ని సంద‌ర్భాల్లో కుద‌ర‌దు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎప్ప‌టిక‌ప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా వ‌ర‌కు ప్ర‌మాదాల్లో అతి వేగ‌మే ప్ర‌ధాన కార‌ణంగా ఉంటుంది. ప్రయాణికులు అనుమతించదగిన వేగ పరిమితులకు మించి నడపకుండా ఉండేందుకు కొత్త కొత్త టెక్నాల‌జీలు ను అడ్ప‌ట్ చేసుకోవాల‌ని ఏపీ ట్రాఫిక్ వింగ్‌లోని సీనియర్ పోలీసు అధికారి న్యూస్18 కి తెలిపారు.

    ఇది చదవండి: దూసుకొస్తున్న ఫోర్త్ వేవ్.. కరోనాపై వైద్యుల అలర్ట్.. పెరుగుతున్న పాజిటివ్ కేసులు..


    ఆంధ్రప్రదేశ్‌లోని జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులపై వేగ పరిమితి 80 నుండి 100 mph అయితే ఎక్కువ మంది వాహనదారులు వేగ పరిమితిని మించి వాహానాల‌ను న‌డుపు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నార‌ని డేటాలో తెలింది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంపై దృష్టి సారించడం, హెల్మెట్‌లు, సీటు బెల్టులు ఉపయోగించడం వల్ల పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు మరణాలు తగ్గుతాయని చాలా సార్లు చెప్పుతున్న‌ప్ప‌టికి కూడా నిర్ల‌క్ష్యంగ వ్య‌వ‌హారించి ప్రాణాల‌పైకి తెచ్చుకుంటున్నార‌ని అంటున్నారు అధికారులు.



    ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డేటా ప్ర‌కారం
    ఏపీలో 2016 నుంచి 2020 వరకు రోడ్డు ప్రమాదాల్లో 39,180 మంది చనిపోయారు. మితిమీరిన వేగం కారణంగా 29,285 మంది మరణించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల దాదాపు 1,000 మంది మరణించారు. మద్యం తాగి వాహనం నడపడం లేదా డ్రగ్స్ సేవించడం వల్ల 358 మంది మరణించారు. డ్రైవింగ్‌లో మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం వల్ల ఏపీలో 208 మరణాలు 2016 నుంచి 2020 వ‌ర‌కు సంభ‌వించాయ‌ని ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డేటా చెబుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Road accidents

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు