M Bala Krishna, News18, Hyderabad
జాతీయ కుటుంబ యరియు ఆరోగ్య సర్వే (National family and Health Survey-5) లో ఏపీలో ఆశ్చర్యపరిచే నిజాలు బయటపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో 18-49 ఏళ్ల వయస్సున్న పెళ్లయిన మహిళల్లో 35 శాతం మంది శారీరక లేదా లైంగిక హింసను ఎదుర్కొన్నారని జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే (NFHS-5) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 34 శాతం మంది శారీరక హింసను ఎదుర్కొన్నారు. దాంతోపాటు 3 శాతం మంది లైంగిక హింసను ప్రతిరోజు అనుభవిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది.
అయితే ఇక్కడ బాధకరమైన అంశం ఒకటొంది ఇలా హింసను ఎదుర్కొంటున్న 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 4% మంది గర్భవతులు ఉన్నారు. ఇలా గర్భవతిగా ఉన్న సమయంలో హింసను ఎదుర్కొంటున్న వారిలో చదువుకున్న మహిళలు (12%), 3-4 మంది పిల్లలు ఉన్న మహిళలు (6%), వితంతువులు విడాకులు తీసుకున్నవారు, విడిపోయిన లేదా విడిచిపెట్టిన మహిళలు (8%) గర్భధారణ సమయంలో హింసను ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
ఇదిలాఉంటే ఏపీలో 18-49 సంవత్సరాల మధ్య వయస్సున్న వివాహిత మహిళల్లో 30 శాతం మంది తమ భర్త వలన శారీరక హింసను అనుభవిస్తున్నారు. 4 శాతం మంది తమ భర్త చేసిన లైంగిక హింసను భరిస్తున్నారట. 15 శాతం మంది మానసికంగా హింసను ఎదుర్కొంటున్నారు. 27% వివాహిత మహిళలు తమ భర్తలచే చెప్పుతో కొట్టబడ్డారని సర్వేలో వెల్లడైంది. 11% మంది తమపైకి నెట్టబడడం లేదా విసిరి కొట్టదడం, తన్నడం, లాగడం లేదా కొట్టడం వంటి చర్యలు ఎదుర్కొన్నట్లు సర్వే లో తెలింది. 8% మంది తమ చేతిని మెలితిప్పి, పిడికిలితో లేదా వారికి హాని కలిగించే వాటితో కొట్టడం వంటివి ఎదుర్కొన్నారు.
18-49 ఏళ్ల వయసున్న పెళ్లయిన మహిళల్లో మూడు శాతం మంది తమ భర్తలు తమకు ఇష్టం లేకపోయినా శారీరకంగా బలవంతం చేశారని, 2 శాతం మంది తమ భర్తలు బెదిరింపులతో లేదా మరేదైనా లైంగిక చర్యలకు పాల్పడ్డారని నివేదించారు. మొత్తం మీద 30 శాతం మంది పెళ్లయిన స్త్రీలు వారి భర్త నుండి శారీరక లేదా లైంగిక హింసను అనుభవిస్తున్నట్లు సర్వేలో తెలింది. NHFS ప్రకారం మహిళలు తమ భర్త తాగిన సమయంలోనే ఎక్కువ హింసకు గురవుతున్నామని తెలిపారు. భార్యలను హింసించేటప్పుడు అది మానసింకంగా అయిన లేదా శారీరకంగా అయిన ఆ సమయంలో దాదాపు 76% మంది భర్తలు తరచుగా తాగి ఉంటారని మహిళలు సర్వేలో తెలిపారు. మొత్తం మీద NHFS సర్వే ప్రకారం రాష్ట్రంలో తాగిన సమయంలో ఎక్కువ హింస మహిళల పై జరుగుతుందని తెలింది. మరో ఇప్పటికే రాష్ట్రంలో మధ్యం అమ్మకాలపై కూడా విమర్శలు వస్తున్న నేపపథ్యంలో ఇప్పుడు ఈ సర్వే ఎలాంటి రాజకీయ దుమారాన్ని లేపుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.