జగన్ ఛలో విశాఖ అంటుంటే... ఆ రెండు ‘గుడ్ బై వైజాగ్’ అంటున్నాయ్...

విశాఖకు సర్వీసులను కూడా రద్దు చేయాలని రెండు విమానయాన సంస్థలు నిర్ణయించడం వ్యాపారవర్గాలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

news18-telugu
Updated: February 21, 2020, 5:04 PM IST
జగన్ ఛలో విశాఖ అంటుంటే... ఆ రెండు ‘గుడ్ బై వైజాగ్’ అంటున్నాయ్...
విశాఖ ఉత్సవ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చి అక్కడి నుంచి పాలన సాగించాలని నిర్ణయించారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లులు పాస్ అయినా కాకపోయినా ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం కూడా ఉంటుందన్న విధానంతో ఆయన ముందడుగు వేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు ముగిసిన తర్వాత విశాఖ కేంద్రంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగించనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉద్యోగులను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఎప్పుడైనా ఆర్డర్స్ రావొచ్చని రెడీగా ఉండాలంటూ ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి సిబ్బందికి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది.

విశాఖ ఉత్సవ్‌కు వచ్చిన సీఎం జగన్‌కు ప్రజల ఘనస్వాగతం


ఓ వైపు జగన్ మోహన్ రెడ్డి ఛలో విశాఖపట్నం అంటుంటే, మరో వైపు రెండు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. విశాఖకు గుడ్ బై చెబుతున్న రెండు విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. చెన్నై - వైజాగ్ - చెన్నై, హైదరాబాద్ - వైజాగ్ - హైదరాబాద్ సర్వీసును రద్దు చేయాలని ఇండిగో విమానయాన సంస్థ నిర్ణయించింది. మార్చి రెండో వారం నుంచి సర్వీసు నిలిపివేతకు ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా అదే దారిలో పయనిస్తోంది. ఢిల్లీ -వైజాగ్ సర్వీసును నిలిపివేసే యోచనలో స్పైస్ జెట్ ఉన్నట్టు సమాచారం. మార్చి నెలాఖరు నుంచి సర్వీసు రద్దు చేసేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్టు తెలిసింది.

goa minister nilesh cabral, IndiGo, IndiGo flight, IndiGo goa-delhi flight,ఇండిగో ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు,ఇంజిన్‌లో మంటలు,గోవా మంత్రి ప్రయాణిస్తున్న మంటలు,
ఇండిగో విమానం(File)
ముఖ్యమంత్రి, సచివాలయం ఉండే చోటకు సహజంగా రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో విమానయాన కంపెనీలు మరిన్ని సర్వీసులు నడపడానికి ముందుకు వస్తాయి. కానీ, విచిత్రంగా ఉన్న సర్వీసులను కూడా రద్దు చేయాలని విమానయాన సంస్థలు నిర్ణయించడం వ్యాపారవర్గాలు, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు