హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big News: ఏపీ సీఐడీకి షాక్..అయ్యన్న రిమాండ్ తిరస్కరణ..బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

Big News: ఏపీ సీఐడీకి షాక్..అయ్యన్న రిమాండ్ తిరస్కరణ..బెయిల్ మంజూరు చేసిన కోర్ట్

అయ్యన్న రిమాండ్ తిరస్కరణ

అయ్యన్న రిమాండ్ తిరస్కరణ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకి భారీ ఊరట లభించింది. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే అయ్యన్న కొడుకుకు కూడా బెయిల్ ఇచ్చింది. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని రిమాండ్ ను విశాఖ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్ట్ కొట్టివేసింది. 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే వీలు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu)కి భారీ ఊరట లభించింది. అయ్యన్నకు రిమాండ్ విధించడానికి తిరస్కరించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే అయ్యన్న (Ayyanna patrudu) కొడుకుకు కూడా బెయిల్ ఇచ్చింది. అయ్యన్న అరెస్ట్ కేసులో 467 సెక్షన్ వర్తించదని రిమాండ్ ను విశాఖ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్ట్ కొట్టివేసింది. 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకునే వీలు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. అయ్యన్నపాత్రుడి (Ayyanna patrudu)ని ఉద్దేశ్యపూర్వకంగా జైల్లో పెట్టాలని అరెస్ట్ చేసినందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదులు కోరారు. అయితే కేసు డైరీని చూసి నిర్ణయం తీసుకుంటామని..కేసు డైరీని సమర్పించాలని సిఐడి అధికారులను కోర్టు ఆదేశించింది. ఉదయం పదిన్నరకల్లా కేసు డైరీ సమర్పించాలని న్యాయమూర్తి సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు.

Kakinada: ఏపీలో ఫ్లెక్సీల వివాదానికి ప‌రిష్క‌రం దొరికిందా..? క్లాత్ బ్యానర్లపై వ్యాపారులేమంటున్నారు..?

కాగా 2 సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించి ఫోర్జరీ పత్రాలను సమర్పించారని అభియోగాలున్నాయి. ఈ కేసులో ఏ-1గా అయ్యన్నపాత్రుడు (Ayyanna patrudu) , ఏ-2గా విజయ్, ఏ-3గా రాజేశ్ ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఎన్ఓసి ఫోర్జరీ చేశారనే అభియోగాలతో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ తెలిపింది. తనది కానీ 2 సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించి కేసులో అయ్యన్న A1, ఆయన కుమారులు విజయ్ A2, రాజేష్ A3గా ఉన్నారు. వారు ఏకంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్నారు. ఫోర్జరీ చేయడం మామూలు విషయం కాదు. ఐపీసీ 464, 467, 471, 474 రెడ్ విత్ 120-B, 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు. కాగా దీనిపై ఫిర్యాదు చేసిన వ్యక్తి మామూలు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సీబీఐకి ఫిర్యాదు చేశాడు కాబట్టి మేం అరెస్ట్ చేశామని సీఐడీ పోలీసులు తెలిపారు.

అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu) తన అరెస్టుపై ఏపీ హైకోర్టు (Highcourt)లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారని అయ్యన్న పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ మేరకు అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన విశాఖ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఏపీ సీఐడీ పోలీసులకు షాక్ తగిలినట్లైంది.

First published:

Tags: Andhrapradesh, Ap, Ayyannapatrudu, Highcourt, TDP

ఉత్తమ కథలు