విశాఖ పోర్టులో మరో ప్రమాదం.. షిప్‌లో మంటలు..

విశాఖ పోర్టులో మరో ప్రమాదం.. షిప్‌లో మంటలు..

విశాఖ పోర్టులోని నౌకలో మంటలు ఆర్పుతున్న ఫైరింజన్లు

విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.

  • Share this:
    విశాఖలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం పోర్టులో భారీ క్రేన్ కూలిన ఘటన మరవకముందే నిన్న చేపల బోటు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ మరో నౌకలో మంటలు అంటుకున్నాయి. నౌకలోని ఇంజిన్ రూమ్‌లో మంటలు చెలరేగినట్టు తెలిసింది. వెస్ట్ క్యూ ఫైవ్ బర్త్‌లో నౌకలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. వెంటనే కోస్ట్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న ఫిషింగ్ హార్బర్‌లో ప్రమాదం జరిగింది. ఓ చేపలబోటుకు మంటలు అంటుకున్నాయి. సముద్రంలో ఉండగానే బోటుకు మంటలు అంటుకోవడంతో ఆ బోటు తగలబడింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. వారు వెంటనే సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బోటులో మంటలను చూసిన ఇతర బోట్ల వారు వెంటనే అక్కడకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.

    కరోనా మరణాలు , కేసుల తీవ్రత , ఆసుపత్రుల్లో అందుతున్న మౌలిక వసతుల ఏర్పాటు పై కాంగ్రెస్ ఆధ్వర్యంలో గట్టి కార్యాచరణ ఉండేలని జగ్గారెడ్డి అన్నారు. గాంధీ ఆసుపత్రికి ప్రభుత్వం తక్షణమే రూ.3000 కోట్లు కేటాయించేలా పిసిసి చీఫ్ ఉత్తమ్ కార్యాచరణ చేపట్టాలన్నారు. దీంతో పాటుగా వివిధ జిల్లాలోని ఆసుపత్రులకు రూ.2 వేల కోట్లను కేటాయించేలా ఒత్తిడి తీసుకోవాలని ఉత్తమ్ కు సూచించారు. మరోమారు సింగూరు , మంజీర డ్యామ్ లను పరిశీలించే అంశంపై ఆలోచించాలని జగ్గారెడ్డి కోరారు. కార్యచరణ ప్రకటిస్తే పోలీసులు అడ్డుకునే అవకాశం ఉండటంతో సమాచారం ఇవ్వకుండా సందర్శించాలని జగ్గారెడ్డి సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: