ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు.. దర్శనానికి భక్తుల అనుమతి..

కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు మూడు రోజుల పాటు శాకంబరి దేవీగా దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆరువేల మంది దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

news18-telugu
Updated: July 2, 2020, 10:28 AM IST
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు.. దర్శనానికి భక్తుల అనుమతి..
విజయవాడ కనకదుర్గమ్మ
  • Share this:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఆలయాలను మూసివేసి.. ఇటీవలే భక్తులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమ్మవారి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు నిర్వహించడంపై ఆసక్తి నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని పలు రకాల కూరగాయాలతో అలంకరిస్తారు. ఈ క్రమంలోనే కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు మూడు రోజుల పాటు శాకంబరి దేవీగా దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఆరువేల మంది దర్శించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అందుకు సంబంధించి అమ్మవారి దర్శనం టికెట్లను ఆన్‌లైన్ ద్వారా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇదే సమయంలో అమ్మవారి ఆలయంలో కేశఖండన శాల సైతం ఇప్పటికే ప్రారంభమయ్యింది. దానికి సంబంధించి అధికారులు గంటకు 90 టికెట్లను విక్రయిస్తున్నారు.
First published: July 2, 2020, 10:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading