East Godavari: పెళ్లి వ్యాన్ బోల్తా.. గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం..!

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులు సంఖ్య ఏడుకు చేరింది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

news18-telugu
Updated: October 30, 2020, 11:03 AM IST
East Godavari: పెళ్లి వ్యాన్ బోల్తా.. గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం..!
తూర్పు గోదావరి జిల్లాలో పెళ్లి వ్యాన్ బోల్తా
  • Share this:
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులు సంఖ్య ఏడుకు చేరింది. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఉన్న చాలా మంది గాఢ నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వివరాలు.. రాజానగరం మండలం వెలుగుబంద అమ్మాయికి, గోకవరం మండలం ఠాకూర్‌పాలెనికి చెందిన అబ్బాయికి గురువారం రాత్రి తంటికొండ కల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. ఈ వేడుక పూర్తయిన తర్వాత నూతన వధూవరుల కుటుంబసభ్యులు, బంధువులు కొండపై నుంచి వ్యాన్‌లో తిరుగుపయనమయ్యారు. ఆ సయమంలో వ్యాన్‌లో దాదాపు 20 మంది ఉన్నారు.

అయితే వ్యాన్ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి మెట్ల మార్గం ద్వారా కొండ కిందకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన పలువురిని రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు.

ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిని యళ్ళ దివ్య శ్రీలక్ష్మి(35), యళ్ళ లక్ష్మి (10), కంబాల భాను(35), సింహాద్రి ప్రసాద్ (25), పచ్చకూరి నరసింహం(24), చాగంటి హేమ శ్రీలత (12), సోమరౌతు గోపాలకృష్ణ (72) గా గుర్తించారు.

తంటికొండ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరాలయం వద్ద జరిగిన ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.పెళ్లి బృందం ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురై పలువురు మృతి చెందడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు ఉన్నత వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Published by: Sumanth Kanukula
First published: October 30, 2020, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading