• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • SENSATIONAL FACTS REVEALED DURING ACB RAIDS IN KANAKA DURGA TEMPLE IN VIJAYAWADA OF ANDHRA PRADESH ENDOWMENT DEPARTMENT SUBMIT REPORT ON TEMPLE EO AND TO TAKE ACTION VERY SOON PRN

Durga Temple: దుర్గమ్మ సన్నిధిలో అడుగడుగునా అవినీతి.. ఈవోపై సంచలన ఆరోపణలు

విజయవాడ దుర్గగుడి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ (Durga Temple) సన్నిధిలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏసీబీ విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏసీబీ విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మూడు రోజుల పాటు కొండపై సోదాలు జరిపిన ఏసీబీ సోదాల్లో సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రతి దాంట్లోనూ అవినీతి చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. శానిటైజేషన్ కాంట్రాక్టులు, సెక్యూరిటీ సిబ్బంది టెండర్లు, స్టోర్స్ లో సరుకుల కొనుగోళ్లు, అమ్మవారి చీరలు అమ్మకాల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఏసీబీ తేల్చింది. ఈ విషయంలో ఈవో సురేష్ బాబుపైనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలను కూడా సురేష్ బాబు పట్టించుకోలేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే 16 మంది ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేయగా... ఒకటి రెండు రోజుల్లో ఈవోపైనా చర్యలు తీసుకుంటారన్న వార్తలు వస్తున్నాయి.

    ఏసీబీ తనిఖీల్లో వెల్లడైన నిజాలన్నీ ఈవో సురేష్ బాబుపైనే వేలెత్తి చూపిస్తున్నాయి. ముఖ్యంగా టెండర్లు, కొనుగోళ్లు, ఇతర కీలక అంశాల్లో ఆయన అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ అర్జునరావు కూడా ఈవో తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏసీబీ సోదాల అనంతరం ఈవో సురేష్ బాబుపై నివేదికను ప్రభుత్వానికి పంపారు.

    ఇది చదవండి: ఒక్క రుపాయికే ఫ్లాట్... పేదలకు జగన్ ప్రభుత్వం బంపర్ ఆఫర్..



    ఇంద్రకీలాద్రిపై సెక్యూరిటీ సిబ్బంది టెండర్లను అక్రమంగా మ్యాక్స్ సంస్థకు కట్టబెట్టినట్లు ఈవో సురేష్ బాబుపై ఆరోపణలున్నాయి. టెండర్ ప్రక్రియలో కొటేషన్లను లీక్ చేసి మ్యాక్ సంస్థకు లబ్ధి చేకూర్చినట్లు తెలుస్తోంది. అమ్మవారి రథంపై వెండి సింహాల మాయం ఘటనలో మ్యాక్స్ సంస్థ వైఫల్యం సప్ష్టంగా కనిపించింది. ఇక శానిటేషన్ సిబ్బంది నియామకంలో ఎల్-3గా నిలిచిన సంస్థకు అక్రమంగా టెండర్లు కట్టబెట్టగా.. ఈ వ్యవహారంలో పెద్దఎత్తున డబ్బులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    ఇది చదవండి: ఏపీ ప్రభుత్వ పథకాల షెడ్యూల్ ఇదే... నెలనెలా సంక్షేమ పథకాలే..



    దర్శనం, ఆర్జిత సేవలు, ఫోటోల అమ్మకాల కౌంటర్లలో రికార్డ్ అసిస్టెంట్లు అవకతవకలు పాల్పడటంతో సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేశారు. ఇక అన్నదానానికి సంబంధించిన వ్యవహారాల్లో అవినీతిని ఏసీబీ బట్టబయలు చేసింది. అన్నదానానికి భక్తుల నుంచి వచ్చిన రూ.54లక్షల విరాళాలలు లెక్కచూపనట్లు తెలుస్తోంది. కూరగాయలు, ఇతర సరుకులు, గ్యాస్ సిలెండర్ల కోనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు తేలింది. కొనుగోలు చేసిన సరుకులకు.. చెల్లించిన బిల్లులకు పొంతన లేకపోవడంతో భారీగా నిధులు దారిమళ్లినట్లు వెల్లడైంది.

    ఇది చదవండి: ఏపీలో ఆ మాంసానికి ఫుల్ డిమాండ్... మగతనం కోసమేనట..



    ఎలాంటి టెండర్లు లేకుండానే సంగం డెయిరీ నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్లు తేలింది. ఆలయానికి సబంధించిన తాళాల నిర్వహణ కూడా సరిగా లేనట్లు అధికారులు తేల్చారు. ఏసీబీ రిపోర్టును పరిశీలించిన అనంతరం ఈవో సురేష్ బాబుపై 16 అంశాలతో కూడిన నివేదికను దేవాదాయ శాఖ ప్రభుత్వానికి అందజేసింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై ఉద్యోగం చేస్తూ అమ్మవారి సొమ్మును దోచుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు.
    Published by:Purna Chandra
    First published: