SENSATIONAL FACTS BEHIND FATHER AND SON SUICIDE ATTEMPT IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH PRN
Affair: కువైట్ లో భార్య.. ఏపీలో ప్రియుడు.. ఇద్దరి వ్యవహారం తెలిసిన భర్త ఏంచేశాడంటే..!
ప్రతీకాత్మక చిత్రం
Affair: గల్ఫ్ వెళ్తే నాలుగు డబ్బులు వెనకేసుకొవచ్చని భర్త, పిల్లలను వదిలి కువైట్ వెళ్లిందో మహిళ, అతడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాయి. ఈ లోగా ఎలా జరిగిందో ఏమోగానీ ఓ కానిస్టేబుల్ తో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఐతే ప్రియుడితో భార్య అసభ్యకరంగా ఉన్న ఫోటోలు భర్తకు చేరడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు.
వారిది పేద కుటుంబం. రెక్కాడితేగానీ డొక్కాడని జీవితం. దీంతో గల్ఫ్ వెళ్తే నాలుగు డబ్బులు వెనకేసుకొవచ్చని భర్త, పిల్లలను వదిలి కువైట్ వెళ్లిందో మహిళ, అతడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాయి. ఈ లోగా ఎలా జరిగిందో ఏమోగానీ ఓ కానిస్టేబుల్ తో భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఐతే ప్రియుడితో భార్య అసభ్యకరంగా ఉన్న ఫోటోలు భర్తకు చేరడంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) సీతానగరం మండలం గోకవరంకు చెందిన వ్యక్తికి వంగలపూడికి చెందిన మహిళతో పెళ్లై ముగ్గురు పిల్లలున్నారు. ఉపాధి కోసం భార్య కువైట్ (Kuwait) వెళ్లింది. భర్త స్వగ్రామంలో ఉంటూ ఆటో నడుపుతుండగా.. పిల్లలు అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ చదువుకుంటున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పిల్లల దగ్గరకు వెళ్లిన తండ్రి.. కొడుకుతో కలిసి ఆత్మహత్యకు యత్నించాడు. ఐతే ఈ కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. కువైట్ లో ఉన్న భార్యకు.. రాజమహేంద్రవరంకు చెందిన కానిస్టేబుల్ లక్ష్మణరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈక్రమంలో లక్ష్మణరావు తరచూ మహిళను ఇక్కడికి రప్పించి ఆమెను ఏకాంతంగా కలుస్తున్నాడు. ఇదిలా ఉంటే మహిళ ప్రైవేట్ ఫోటోలను కానిస్టేబుల్ ఆమె బంధువులకు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫోటోలు, వీడియోలు వల్లే మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు ఆమె భర్త వెల్లడించారు. తాను చనిపోతే పిల్లలు ఒంటరివారవుతారనే వారితో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపాడు.
ఇదే సమయంలో అసభ్య ఫోటోలు, వీడియోల సంగతి బంధువులు.. కువైట్ లో ఉన్న మహిళకు చెప్పారు. అంతేకాదు భర్త, పిల్లలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వివరించారు. దీంతో ఆమె అక్కడే గుర్తుతెలియని మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. ఐతే అక్కడివారు ఆమెను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటడింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారి అయిన కానిస్టేబుల్ లక్ష్మణరావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలను పరిశీలించిన అనంతరం సరైనవేనని రుజువైతే ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు..
కర్నూలు జిల్లాలో దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నద్యాలకు చెందిన ఈశ్వర్ రెడ్డి పలు వ్యాపారాలు చేసి నష్టపోయాడు. అప్పుల వాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రాంతంలో ఉంటూ అప్పుడప్పుడు భార్యాపిల్లల వద్దకు వచ్చి వెళ్తునాడు. ఈ క్రమంలో భార్య శివపార్వతి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఓ రోజు రాత్రి ఈశ్వర్ రెడ్డి ఇంటికొచ్చిన సమయంలో ప్రియుడితో కలిసి భార్య రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో భార్య, ప్రియుడు, అతని స్నేహితులు కలిసి ఈశ్వర్ రెడ్డిపై కర్రలతో దాడి చేశారు. స్థానికులు రావడంతో వారి నుంచి తప్పించుకున్న ఈశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.