హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

RGV-Perni Nani Meeting: పేర్ని నానితో వర్మ భేటీకి టైమ్ ఫిక్స్..! వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా..?

RGV-Perni Nani Meeting: పేర్ని నానితో వర్మ భేటీకి టైమ్ ఫిక్స్..! వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారా..?

మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ

మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government), సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ramgopal Verma) కు మధ్య కొంతకాలంగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేదిశగా చర్చించేందుకు ఆర్జీవీ.. మంత్రి పేర్ని నాని (Perni Nani) తో భేటీ కానున్నారు.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Verma) కు మధ్య కొంతకాలంగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వ తీరును మీడియా ఎదుట, సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ఖండించారు. అంతేకాదు జగన్ ప్రభుత్వానికి, మంత్రి పేర్ని నాని (Perni Nani) కి కూడా చురకలంటించారు. సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై ట్విట్టర్ వేదికగా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. ఆర్జీవీ ప్రశ్నలకు పేర్ని నాని కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియా వేదిగా సాగుతున్న వార్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మీటింగ్ గా మారనుంది. రెండు రోజల్లో ఆర్జీవీ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ కానున్నారు.

తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని.. ఈనెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు. ఈ భేటీలో ప్రధానంగా సినిమా టికెట్ల ధరలపైనే చర్చించనున్నారు. ఐతే వర్మ ఎలాంటి అంశాలను మంత్రి ముందుంచుతారు..? ఆయన ప్రతిపాదనలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా..? అనేది చాలా ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: ఆ మంత్రి అంటేనే హడలిపోతున్న పీఏలు, పీఆర్వోలు.. ఇలాగైతే కష్టమేనా..?


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా థియేటర్లలో తనిఖీలు చేయడం, టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం లేదనేది వర్మ వాదన. ఐతే ఇష్టానుసారం టికెట్ల ధరలను పెంచి సామాన్యుడిపై భారం వేస్తున్నారని.. దానిని మాత్రమే నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.

ఇది చదవండి: కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..


ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ ఒకింత ఘాటు వ్యాఖ్యలే చేశారు. సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తారా..? అనే ప్రశ్నకు.. వైసీపీ పాలన నచ్చకుంటే దిగిపోతారా..? అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక హీరో నానీపై మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు.. తనకు హీరో నాని మాత్రమే తెలుసని.. మరే ఇతర నానీలు తెలియదంటూ మంత్రి కొడాలి నానికి కౌంటర్ వేశారు వర్మ.

ఇది చదవండి: రోజా చేసిన పని జగన్ ను ఇరుకున పెట్టిందా..? ప్రభుత్వంపై విమర్శలు తప్పవా..?


ఇక వరుస ట్వీట్ల వార్ తర్వాత వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అనేది తమ ఉద్దేశం కాదని.. పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు అభిమానమని.. కేవలం సినీ ఇండస్ట్రీ సమస్యలు సరిగా చెప్పుకోలేకపోవడం వల్లో లేక మీరు మా కోణంలో నుంచి అర్ధం చేసుకోకపోవడం వల్ల మిస్ అండర్ స్టాండింగ్ ఏర్పడిందని.. మీరు అనుమతిస్తే నేను మిమ్మల్ని కలిసి మా తరపు నుంచి మా సమస్యల కి సంభందించిన వివరణ ఇస్తానని.. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాని.. వర్మ ట్వీట్ చేయగా.. స్పందించిన పేర్ని నాని త్వరలోనే కలుద్దామంటూ రిప్లై అచ్చారు. తాజాగా ఈనెల 10వ తేదీన కలవాలని సూచించారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, Ram Gopal Varma

ఉత్తమ కథలు