SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA TARGET TO CM JAGAN HE GAVE SOME SUGGESTIONS IN SOCIAL MEDIA NGS
RGV: మొన్నటి వరకు మంత్రులతో వార్.. నేడు జగన్ ను టార్గెట్ చేసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ
RGV vs AP Government: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు నేరుగా జగన్ ను టార్గెట్ చేశారా..? మొన్నటి వరకు మంత్రులను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారు. వరస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. దీంతో మంత్రి ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నేరుగా సీఎంను ఉద్దేశిస్తూ వర్మ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Ram Gopal Varma: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల వ్యవహారపై వేడి చల్లారడం లేదు.. ఇటు ఏపీ ప్రభుత్వం (AP Government) తగ్గేదే లే అని స్పష్టం చేయడంతో.. సినిమా దర్శకులు, నిర్మాతలు వివిద రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. తాజాగా ఈ ఇష్యూలో ఎంట్రీ ఇచ్చిన వివాదాస్పద దర్శకు రామ్ గోపాల్ వర్మ(Ramgopal varma).. ఏపీ ప్రభుత్వం పై సోషల్ మీడియా (Social Media) వేదికగా యుద్దం ప్రకటించారు.. విరామం లేకుండా మంత్రి పేర్ని నానిని (Minster Prrni Nani) కోట్ చేస్తూ.. పది ప్రశ్నలు సంధిచారు. దానికి మంత్రి సైతం అదే స్థాయిలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. అయితే ఇద్దరూ గౌరవ పూర్వకంగానే సమాధానాలు చెప్పుకున్నారు. మంత్రి సమాధానం ఇచ్చిన తరువాత కూడా వర్మ వదల్లేదు. మీ స్థాయి మీ డ్రైవర్ స్థాయి ఒకటేనా అని ప్రశ్నించారు. చిరంజీవి (Chiranjeevi) సినిమా సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) సినిమా ఒకేటా అని నిలదీశారు.. అయినా మీరుచ్చిన సమాధానాలు మీకు అర్థం అయ్యి ఉంటే.. సమస్య లేనట్టే అంటూ సెటైర్ వేశారు. అయితే వివాదం మరింత ముదరకుండా.. నేరుగా కలిసి సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వాలని ఆర్జీవి కోరగా.. అందుకే మంత్రి పేర్ని నాని తప్పకుండా త్వరలో కలుద్దామని చెప్పడంతో వారిద్దరి మధ్య సోషల్ మీడియా యుద్ధం ముగిసింది..
ఇప్పుడు ఇక సీఎం జగన్ కు సలహాలు ఇస్తూ రామ్ గోపాల్ వర్మ చేసిని పోస్ట్ వైరల్ అవుతోంది. గత కొన్ని రోజుల నుంచి టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలన పోస్ట్ చేశారు. మొన్నటి వరకు మంత్రులను ప్రశ్నిస్తూ విరుచుకుపడ్డ ఆయన.. ఇవాళ సీఎం జగన్ కు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. చుట్టూ జరుగుతున్న దాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారు అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు.
సీఎం జగన్ పై తనకు ఎంత ప్రేమో ఉందో తెలియ జేస్తూనే పోస్ట్ చేశారు. వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారని వర్మ ట్విట్లో రాశారు. ఇకనైనా తన చుట్టూ ఉన్న ప్రమాదకర వ్యక్తుల పట్ల జగన్ అప్రమత్తంగా ఉంటారని నమ్ముతున్నా.. అని పేర్కొన్నారు. అయితే, ఆపార్టీలో గౌరవించే ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని ఆర్జీవీ పేర్కొన్నారు.
ఇలా ముఖ్యమంత్రిని గౌరవిస్తూ.. ఆయనకు సూచనలు చేస్తూ పోస్ట్ చేసినా రామ్ గోపాల్ వర్మ.. ఇటీవల మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలీదు అంటూ సంచలన ట్వీట్ చేశారు. తనకు తెలిసి నాని అంటే నాచురల్ స్టార్ నాని మాత్రమే అంటూ వర్మ ట్వీట్ చేశారు. దీనిపై పెను దుమారం రేగుతోంది కూడా..
A P టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ @NameisNani ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు.
ఇలా ఏపీ ప్రభుత్వం.. మంత్రులపై సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించిన వర్మ.. ఇప్పుడు సీఎం జగన్ అంటే తనకు ఇష్టం అని చెబుతూనే ఆయనకు కొన్ని సలహాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి దీనిపై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.. మంత్రి పేర్ని నాని, కొడాలి నాని స్పందించినట్టే.. సీఎం జగన్ పై కామెంట్లకు వైసీపీ నుంచి ఎవరు కౌంటర్ ఇస్తారో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.