SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA MEET ANDHRA PRADESH MINSTER PERNI NANI TO DISCUSS TOLLYWOOD ISSUES NGS
RGV meet Minster: ఇవీ మా సమస్యలు.. పరిష్కరిస్తారా..? మంత్రితో వర్మ
మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ
RGV meet Minster: టాలీవుడ్ - ప్రభుత్వానికి మధ్య గ్యాప్ కు తగ్గుతుందా..? సినిమా సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగు వేస్తుందా..? లేదా ఈ గ్యాప్ మరింత పెరుగుతుందా.. ఈ అంశాలు అన్నింటికీ కాసేపటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ మంత్రికి వర్మ ఏం చెప్పారు అంటే..?
Ram Gopal Varma meet Minster Perni Nani : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్(Tollywood)గా మారిన వివాదానికి పుల్ స్టాప్ పడినట్టేనా..? సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Verma) ఇప్పుడు నేరుగా ఏపీ మంత్రి పేర్ని నాని (Minster Perni Nani)ని కలవడంతో సమస్యలకు పరిష్కారం దొరికే పరిస్థితి ఉందా..? ఏపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించే దిశగా ఓ అడుగు అయితే ముందుకు పడింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధం చేసిన వర్మ.. ఆ వార్ కు బ్రేకులు వేశారు.. ఇవాళ నేరుగా మంత్రి పేర్ని నానితో సినిమా పరిశ్రమ ఎదుర్కంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన.. నేరుగా సచివాలయంలో మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. అయితే వీరిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయి.. వర్మ కోరిన అంశాలపై మంత్రి ఎలా స్పందించారు.. వీటన్నటికీ కాసేపటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ల ధరలు పెంచకపోతే భారీ నష్టం తప్పదనే విషయం మంత్రికి చెప్పినట్టు సమాచారం..
గత కొన్ని రోజుల ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా పరిస్థితి కనిపించింది. ఓ వైపు కరోనా భూతం.. మరోవైపు కర్ఫ్యూ.. లాక్ డౌన్ ల కారణంగా సినిమా ఇండస్ట్రీ భారీగా నష్ట పోయింది. ఇదే సమయంలో తెలంగాణలో సినీ పరిశ్రమకు వరాలు కురిపిస్తే.. ఏపీ ప్రభుత్వం పరిస్తితి భిన్నంగా ఉందన్నది సినిమా పెద్దల వాదన.. ముఖ్యంగా పెద్ద సినిమాల సమయంలో టికెట్ల ధరలు భారీగా పెరిగిన ఆనవాయితీ వస్తూ ఉంది. ఆ వ్యవహారానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది..
ఏపీ వ్యాప్తంగా టికెట్ల ధరలను తగ్గిస్తూ.. ఒకే రకమైన టికెట్ల ధరలను ఫిక్స్ చేసింది ఏపీ ప్రభుత్వం.. అంతేకాదు స్వయంగా ప్రభుత్వమే ఆన్ లైన్ లో టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం సినిమా పెద్దలకు షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ముఖ్యంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు టికెట్ల రేట్లు తగ్గిస్తే భారీగా నష్టాలు వస్తాయి అన్నది టాలీవుడ్ పెద్దల వాదన..
ప్రభుత్వం మాత్రం సామాన్యులకు సినిమాను అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యం అంటోంది. సినిమా పెద్దది అయినా.. చిన్నది అయినా ఒకే రేేటు ఉండాలని.. సామాన్యుడిని టికెట్టు పేరుతో దోపీడీ చేస్తే చూస్తూ ఊరుకోమన్నది మంత్రుల అభిప్రాయం. దీనిపై ఏదో ఒకరూపంలో స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు అసహనం వ్యక్తం చేశారు. కొందరు నేరుగా వెళ్లి తమ సమస్యలను ప్రభుత్వానికి చేరవేశారు. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గేదే లే అని స్పష్టం చేసింది.
సరిగ్గా అదే సమయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చారు.. మంత్రులను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వారం రోజుల పాటు ట్వీట్ల యుద్ధం చేశారు.. దీంతో గ్యాప్ మరింత పెరుగుతోంది అనుకున్న సమయలో అనూహ్యంగా మంత్రిని కలుస్తానని కోరడం.. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి అపాయింట్ మెంట్.. ఇవ్వడం.. ఇద్దరూ కలిసి సినిమా సమస్యలపై చర్చించడం వెంట వెంటనే జరిగిపోయాయి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.