ఏపీకి అమరావతినే రాజధానిగా కోనసాగించాలని సుదీర్ఘకాలంగా పాదయాత్ర చేస్తున్నారు. అయితే రైతుల పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయింది. ఈ క్రమంలో అమరావతి రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ఆలోచనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నేడు మధ్యాహ్నం విజయవాడ నుండి అమరావతి రైతులు ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయలుదేరారు. నేడు, రేపు వీరి ప్రయాణం కొనసాగి రేపు రాత్రికి ఢిల్లీకి చేరుకోనున్నారు. అనంతరం అక్కడే బస చేసి డిసెంబర్ 17న దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నారు.
కేంద్ర మంత్రులను కలుస్తారా?
రైతుల పాదయాత్రకు అమరావతి జేఏసీ మద్దతు తెలుపుతుంది. అయితే రైతులు, జేఏసీ నేతలు ఢిల్లీకి వెళ్లి అక్కడున్న తెలుగు వారిని కూడా కలుపుకుపోవాలని చూస్తున్నారు. అయితే తమ ఉద్యమాన్ని కేంద్రానికి తెలిసేలా చేయబోతున్న ఈ ధర్నా డిసెంబర్ 17న చేయడానికి ఓ కారణం ఉంది. 3 రాజధానుల నిర్ణయానికి డిసెంబరు 17వ తేదీకి 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న క్రమంలోనే రైతులంతా ఏకం అవుతూ దేశ రాజధానిలో ధర్నా చేపట్టబోతున్నారు. మరి ఈ ధర్నాలో భాగంగా వారు కేంద్ర మంత్రులను కలుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
'ధరణికోట నుంచి ఎర్రకోట'కు 1800 మంది అమరావతి రైతుల రైలు ప్రయాణం! 3 రాజధానుల నిర్ణయానికి డిసెంబరు 17వ తేదీకి 3 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియచేయనున్న అమరావతి రైతులు!#OneCapitalForAP #OneStateOneCapital #Amaravati #OneCapital pic.twitter.com/ueNPB3EIxb
— ???????????????? ???????????????????????????? ???????????????????????????????????? (@TheOneCapital) December 14, 2022
కాగా అమరావతి(Amravati)ని రాజధాని చేయాలని రైతులు చేపట్టిన పాదయాత్ర ఇటీవల 41వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో (Ramachandra Puram) బైపాస్ రోడ్డు నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రైతులకు (Farmers) సంఘీభావం తెలపడానికి వచ్చే వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పొందిన రైతులు వారి ఐడి కార్డులను చూయించండి. అలాగే అనుమతి ఉన్న వాహనాలు కాకుండా మిగతా వాటిని అనుమతించబోమని పోలీసులు అన్నారు. దీనితో పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక పోలీసుల తీరుపై హైకోర్టుకు (High court) వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు హైకోర్టులో (Ap High Court) పిటిషన్ కూడా వేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని లాయర్లు కోరడం.. రైతులు 600 మంది మాత్రమే పాల్గొంటారని చెప్పిన పిటిషనర్లు, సంఘీభావం తెలిపేవారు పాదయాత్రలో ముందు, వెనకా నడిచేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. కానీ నేడు రైతుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు (Ap High Court) గతంలో హైకోర్టు సూచించిన నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో కేవలం 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని కోర్టు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhrapradesh, Ap, AP News