Home /News /andhra-pradesh /

SENIOR IPS AB VENKATESWARA RAO MADE SENSATIONAL COMMENTS ON HIS SUSPENSION ISSUE FULL DETAILS HERE PRN GNT

AP News: రాష్ట్రాన్ని తగలబెడుతుంటే అడ్డుకున్నా.. అందుకే ఇదంతా..! ఏబీ వెంకటేశ్వరరావు సంచలన కామెంట్స్..

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (File)

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు (File)

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన రెండు వారాల్లోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆయనపై సస్పెషన్ వేటు వేసిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
    సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇచ్చిన రెండు వారాల్లోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆయనపై సస్పెషన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ వ్యవహారంపై బుధవారం ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. సస్పెషన్ జీవో ఇంకా తన చేతికి రాలేదని.. సోషల్ మీడియాలో మాత్రమే చూశానని ఆయన తెలిపారు. తనపై ఏసీబీ కేసు ఉన్న మాట వాస్తవమేని.. ఐతే ఏడాదిన్నర క్రితం కేసు రిజిస్టర్ చేసినా ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదని.. ట్రయల్ మొదలవకుండా తాను సాక్షులను ఎలా ప్రభావితం చేయగలనని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి చచ్చు సలహాలు ఏ తీసేసిన తహసీల్దారో లేక పనికిమాలిన సలహాదారులో ఇచ్చి ఉంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.

    ఒకసారి హై కోర్టు కొట్టేసినప్పుడు అదే సెక్షన్ కింద మళ్లీ ఎలా సస్పెండ్ చేస్తారని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఆలిండియా సర్వీస్ నిబంధనలు వర్తించవనుకుంటే.., ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపైనా చార్జిషీట్లు ఉన్నాయని.. ఆమెకు వర్తించని నిబంధనలు తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు ఏబీవి.ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నివేదికలో ప్రతి వాక్యం తప్పని నిరూపిస్తానని.. ఒక్క రూపాయి అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తుల వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు.

    ఇది చదవండి: ఏపీలో బలపడేందుకు బీజేపీ యత్నం.. మోదీ టూర్ తో వ్యూహం మారుతుందా..?


    కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయని.. వాళ్లే ఇదంతా చేస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు. కోడికత్తి కేసు అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని తగలబెట్టాలని చుస్తే గంటల్లోనే అడ్డుకున్నానని.., ఎన్నో వెధవ పనులు అడ్డుకున్నందుకే నన్ను టార్గెట్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని పడగొడతానంటూ అనాడు రాజభవన్ గేటు ముందు కామెంట్ చేసింది తాను కాదని గుర్తుచేశారు.



    ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానన్న ఏబీ వెంకటేశ్వరరావు.., సమజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నాననంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేసెకంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నారంటూ గుర్తుచేశారాయన. మూడేళ్లుగా తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటీ నిరూపించలేకపోయారని.. పెట్టిన కేసులనే మళ్లీ పెడుతున్నారంటే తనను టార్గెట్ చేశారని అర్ధమవుతోందన్నారు. సీఎం నుంచి కిందస్థాయి ఉద్యోగి వరకు అందరూ రూల్స్ పాటించాల్సిందేనని.. తప్పుడు పనులు చేస్తే ఏదో ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. తనపై పెట్టిన కేసులు న్యాయసమీక్షకు కూడా నిలబడవన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: AB venkateshwara rao, Andhra Pradesh, Ap government

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు