సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (IPS AB Venkateswara Rao) సంచలన కామెంట్స్ చేశారు. తాను ఏం చేసినా చట్టానికి లోబడే చేశానని ఆయన అన్నారు. ప్రభుత్వ సలగాదారు సజ్జల నాపై మీడియాలో బురద జల్లడం ఎంతవరకూ కరెక్ట్? అని ప్రశ్నించారాయన. మూడేళ్లుగా తనపై చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయారన్న ఆయన.. రెండేళ్ల జీతం కోసం హైకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. జీఏడీలో నాకంటే జూనియర్ ఆఫీసర్లు ఉన్నారని.. అందుకే సీఎస్ ను కలిసి రిపోర్ట్ చేయాలనుకున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎస్ ఆపాయింట్ ఇవ్వకపోవడంతో ఆయన పీఏ కు లెటర్ ఇచ్చానని తెలిపారు తాను ఎలా పనిచేశానో అందరికీ తెలుసున్న ఆయన.., నిబద్ధతతో వ్యవహరించానన్నారు.
గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేశారని.., తాను ఏమి చేసినా చట్టానికి లోబడే పనిచేశానని స్పష్టం చేశారు. సీఎస్ ఉద్దేశపూర్వకంగానే తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించిన ఆయన.. రెండేళ్ల సస్పెన్షన్ ను సర్వీస్ గా పరిగణించాలని సీఎస్ ను అడుగుదామనుకున్నట్లు తెలిపారు. రెండేళ్ల సీఎస్ పదవీ కాలం ఆరునెలలు పొడిగించారని.. తనకు మాత్రం రెండేళ్ల సర్వీస్ ఉందన్న ఏబీ.. నాకు పోస్టింగ్ ఇవ్వకపోతే ప్రజాధనం వృధా అవుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏబీని తిరిగి సర్వీసులోకి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ రీ ఇన్ స్టేడ్ అవుతందని తెలిపింది. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వని ప్రభుత్వం.. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
టీడీపీ (TDP) ప్రభుత్వ హాయంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీంతో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. సస్పెన్ష్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఐతే దీనిని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ప్రభుత్వం సర్వీస్ లోకి తీసుకుంది. ఐతే పోస్ట్ మాత్రం కేటాయించలేదు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్ డీజీ పోస్ట్ నుంచి తొలగించింది. 2017-18లో పోలీసు శాఖ ఆధునికీకరణ కోసం టీడీపీ ప్రభుత్వం భద్రతా పరికరాలు కొనుగోలు చేసిన వ్యవహారంలో ఏబీ అక్రమాలకు పాల్పడ్డట్లు ప్రభుత్వం ఆరోపించింది. పరికరాల కొనుగోలు కాంట్రాక్టును ఇజ్రాయిల్ కు చెందిన ఆర్టీ ఇన్ ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు దక్కెలా చేయడమే కాకుండా, అదే సంస్థకు తన కుమారుడు ఇండియాప్రతినిథిగా ఉన్న సంగతిని దాచి పెట్టింది. ఈ విధంగా తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థకు ప్రయోజనం చేకూర్చారని ప్రభుత్వం ఏబీపై ఆరోపణలు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.