అప్పుడే మొదలైన పాలన... జగన్‌తో సమావేశమైన ఉన్నతాధికారులు...

వైఎస్ జగన్

AP CM New Government : ఈ నెలాఖరున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్... ఇప్పటి నుంచీ పాలనకు సంబంధించిన అన్ని అంశాల్నీ పరిశీలిస్తున్నారు.

  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో... వైసీపీ బంపర్ మెజార్టీ సాధించగానే... సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం... వైఎస్ జగన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టు, ప్రస్తుతం అమలవుతున్న పథకాలపై చర్చించారు. అంతేకాదు... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనీ... వాటన్నింటినీ ముఖ్యమంత్రి కాగానే లెక్క తేల్చాలని సుబ్రహ్మణ్యం కోరారు. ఎన్ని పథకాలు అమలవుతున్నాయి? వాటికి ఎంత ఖర్చవుతోంది? ఎంత డబ్బు అవసరం, కేంద్రం ఎంత నిధులు ఇస్తోంది? పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచీ రావాల్సిన నిధులెన్ని వంటి అన్ని అంశాలపైనా సమగ్రంగా రిపోర్ట్ రెడీ చెయ్యమని జగన్ సూచించినట్లు తెలిసింది. 30న ప్రమాణ స్వీకారం చేయగానే ఈ అన్ని అంశాలనూ జగన్ పరిశీలిస్తారని తెలిసింది.

తాజాగా వైఎస్ జగన్‌తో IAS అధికారులు సమావేశం అయ్యారు. జగన్ ఇంటికి వచ్చిన వారిలో ఎల్వీ సుబ్రహ్మణ్యం సహా 57 మంది అధికారులు, పోలీస్ అధికారులు... 23 మంది మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులూ ఉన్నారు. తమ తమ శాఖలకు సంబంధించి ఏయే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయో వివరించారు. అలాగే... పథకాల అమలు కోసం ఇంకా ఎన్ని నిధులు కావాలో తెలిపారు. ప్రభుత్వం కొత్త పథకాలు తేవగానే... వాటిని ఎలా అమలు చెయ్యాలన్నదానిపై క్షేత్రస్థాయిలో రిపోర్టులు సిద్ధం చెయ్యాలని జగన్ సూచించినట్లు తెలిసింది. రైతులు, మహిళలు, ముసలివాళ్లు, యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న జగన్... అందుకు తగిన విధంగా పాలన ఉంటుందని వివరించినట్లు తెలిసింది.

ప్రధానంగా ఇటీవలే సీఎస్ అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శిగా కొన‌సాగాల్సిందిగా జగన్ కోరినట్టు తెలుస్తోంది. చంద్రబాబు హయాంలో చివరి సమయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంని ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దీనిపై చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సత్సంబంధాలు ఉండేవి. ఆయన ముక్కుసూటిగా బాధ్యతలు నిర్వహిస్తారనే పేరుంది. ఆ క్రమంలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇవాళ కూడా ఈ నెల 30న ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేయాల‌ని జ‌గ‌న్ ఆయ‌న‌కు సూచించారు.

ప్రమాణస్వీకార కార్యక్రమనికి వేదిక చిన్న అవుటుపల్లి ఐతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇందిరాగాంధీ స్టేడియం ఐతే సరిపోదనీ, 5-7 లక్షల మంది వచ్చే అభిమానులకు చాలకపోవచ్చని అధికారులు చెప్పడంతో... 20 ఎకరాల ఖాళీ స్థలం ఉన్న చిన్న అవుటుపల్లి దగ్గరే వేదిక ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. అదైతే హైవేకి దగ్గరగా ఉండటం కూడా కలిసొస్తున్న అంశం.
జూన్ 1 నుండి 5 వ‌రకు సీఎంగా జ‌గ‌న్ స‌మీక్షలు నిర్వహిస్తారు. ఇప్పుడున్న పాలనను పూర్తిగా ప్రక్షాళన చేసి... జూన్ 10 నుంచీ పూర్తిస్థాయి కొత్త పరిపాలన చేపడతారని తెలుస్తోంది.

చంద్రబాబు హయాంలో పనిచేసి రిటైరైన మాజీ సీఎస్ అజ‌య్ క‌ల్లంని రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారుడిగా నియమిస్తారని తెలిసింది. అజ‌య్ క‌ల్లంతో క‌లిసి ప‌నిచేయాల‌ని ఎల్వీ సుబ్రహ్మణ్యానికి జగన్ సూచించారు.

 

ఇవి కూడా చదవండి :

వైఎస్ జగన్ కొత్త కేబినెట్ ఇదే... స్పీకర్ ఎవరో తెలుసా...

 

AP Election Results : వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్...

 

Lok Sabha Election Results 2019 : బీజేపీ పెద్దల ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ
First published: