ఏపీకి IAS శ్రీలక్ష్మీ... అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి... 1న బాధ్యతలు

IAS Sri Lakshmi : భూ గనుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న IAS అధికారి శ్రీలక్ష్మికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయంటున్నారు వైసీపీ నేతలు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 28, 2019, 10:23 AM IST
ఏపీకి IAS శ్రీలక్ష్మీ... అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జి... 1న బాధ్యతలు
IAS అధికారి శ్రీలక్ష్మీ (FILE)
  • Share this:
సీనియర్ IAS అధికారి శ్రీలక్ష్మి గుర్తున్నారుగా... ఆమె ఏపీకి రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ శ్రీలక్ష్మీ... డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెడుతున్నారు. ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జిగా జూన్ 1న బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకు సంబంధించి చకచకా వ్యవహారాలు జరిగిపోయాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో... ఆయన్ని కలిసిన శ్రీలక్ష్మీ... ఏపీలో సేవలు అందించాలనుకుంటున్నాననీ, అవకాశం ఇవ్వాలనీ కోరినట్లు తెలిసింది. అందుకు ఒప్పుకున్న జగన్... ఆమెకు కీలక శాఖ ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఏపీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జిగా ఆమెను నియమిస్తున్నట్లు తెలిసింది.

శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలు పాలయ్యారు. జైల్లో అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చాక IASగా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శ్రీలక్ష్మీ... చిన్న వయస్సులోనే సివిల్‌ సర్వెంట్‌ అయ్యారు. ఆమె కెరీర్‌ ఒడిదుడుకుల్లేకుండా సాగితే కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి స్థాయికి వెళ్లేవారు. ఓబుళాపురం గనుల అవినీతి కేసులు ఆమె మెడకు చుట్టుకోవడంతో వృత్తిపరంగా అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఆమె ఏపీకి వెళ్తుండటంతో... కెరీర్ అవకాశాలు మెరుగయ్యే ఛాన్సుంది.

డిప్యుటేషన్‌కి సంబంధించి... తెలంగాణ ప్రభుత్వానికి శ్రీలక్ష్మి్ అప్లికేషన్ పెట్టుకోగా... అటు నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. ఇప్పటికే ఐపీఎస్‌ అధికారి స్టీఫెన్‌ రవీంద్ర ఏపీకి వెళ్లడం ఖాయమైంది. శ్రీలక్ష్మి కూడా ఏపీకి వెళ్తుండటంతో... ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఏపీకి చెందిన మరికొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు డిప్యుటేషన్‌పై ఏపీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ అధికారంలోకి రావడందతో... వైఎస్ హయాంలో పేరుతెచ్చుకున్న ఉన్నతాధికారులు మళ్లీ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పనిచేసే అవకాశాలు లభిస్తున్నాయి.

 ఇవి కూడా చదవండి :

వైరల్ వీడియో... స్టేజీపై పాడుతూ... కుప్పకూలి చనిపోయిన ఎస్సై...

తెలంగాణలో ఐదుగురు మంత్రులు ఔట్..? లోక్ సభ ఎన్నికల ఫలితం...జగన్ ప్రకటనతో టీడీపీలో మళ్లీ ఉత్సాహం... గుంటూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

జూన్ 5 వరకూ తీవ్ర ఎండలే... RTGS హెచ్చరిక... బయటకు వెళ్లొద్దు...
First published: May 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>