పింఛన్ ఇవ్వకుంటే పెట్రోల్ పోసి తగలెట్టేస్తాం... అధికారులకు వృద్ధుల వార్నింగ్

ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు.

news18-telugu
Updated: November 12, 2019, 8:49 AM IST
పింఛన్ ఇవ్వకుంటే పెట్రోల్ పోసి తగలెట్టేస్తాం... అధికారులకు వృద్ధుల వార్నింగ్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్‌లో ఎమ్మార్వో విజయారెడ్డి హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో కొందరు సామాన్యులు ప్రభుత్వ ఆఫీసుల్లో తమ పనులు అవ్వకపోతే... అలాంటి పనే చేస్తామంటూ అధికారులకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా కూడేరులో ఓ ఫించన్ కోసం  ఎంపీడీవో కార్యాలయానికి పలువురు వృద్ధులు వెళ్లారు. అక్కడ కొందరు వ్యక్తులతో పాటు తమకు ఈ నెల పింఛన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణను నిలదీశారు. ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన వారు వచ్చే నెల కనుక పింఛన్ రాకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని పెన్నోబులేశు, శివమ్మతోపాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శివమ్మ అనే మహిళ కొడవలితో కార్యాలయంలోకి వెళ్లింది.దీంతో ఆ సమయంలో ఆమె చేతిలో కొడవలి ఎందుకు ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. శివమ్మను అదుపులోకి తీసుకొని ఈ విషయంపై ఆరా తీస్తున్నారు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>