స్టెరిన్‌కు విరుగుడు ఇదే... గుజరాత్ నుంచి తరలింపు...

ప్రతీకాత్మక చిత్రం

స్టెరిన్‌కు విరుగుడును గుజరాత్ నుంచి విశాఖకు పంపిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

  • Share this:
    విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో స్టెరిన్ గ్యాస్ లీక్ అయి ఇప్పటి వరకు 9 మంది చనిపోయారు. 350 మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కంపెనీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాల్లో 15వేల మంది భయాందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో స్టెరిన్‌కు విరుగుడును గుజరాత్ నుంచి విశాఖకు తీసుకొస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. స్టెరిన్‌ను పీటీబీసీ ద్వారా అరికట్టొచ్చని ఎల్జీ పాలీమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తమతో చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. విశాఖపట్టణం గ్యాస్ లీకేజ్ ప్రమాదంపై తీసుకుంటున్న చర్యలను కిషన్ రెడ్డి వివరించారు. విశాఖ ఘటనపై అమిత్ షాతో చర్చించామని ఆయన చెప్పారు. గుజరాత్‌లోని వ్యాపిలో పీటీబీసీ లభ్యమవుతోందని, అక్కడి నుంచి డామన్ ఎయిర్ పోర్టు ద్వారా విశాఖకు తరలిస్తున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. అలాగే, పూణె నుంచి నిపుణులను కూడా పంపుతోంది. స్టెరైన్, బూటాడిన్, వినైల్ అసిటేట్ లాంటి ప్రమాదకర వాయువులను నిరోధించడంలో పీటీబీసీ ఉపయోగపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: