సికింద్రాబాద్- తిరుపతి మధ్య కొత్త రైలు...26 నుంచి పరుగులు

భాగ్య నగరం నుంచి తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జంట నగరాల నుంచి ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లే వారి కోసం జన్‌సాధరణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించింది.

news18-telugu
Updated: July 20, 2019, 9:20 AM IST
సికింద్రాబాద్- తిరుపతి మధ్య కొత్త రైలు...26 నుంచి పరుగులు
నమూనా చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. నిత్యం తిరుమల కొండకు వేలాదిగా భక్తులు తరలివెళ్తుంటారు. ఇక భాగ్య నగరం నుంచి తిరుమల వెళ్లే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జంట నగరాల నుంచి ఏడుకొండలవాడి దర్శనానికి వెళ్లే వారి కోసం జన్‌సాధరణ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభించింది. 07202 నెంబర్ గల ఈ రైలు... ఈనెల 26 నుంచి పట్టాలపై పరుగులు తీయనుంది.

ఆగస్టు 2, 9, 16, 23, 30, సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రైలు (07201) సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. జంటనగరాల వాసులకు తిరుపతి వెళ్లేందుకు మరో ట్రైన్ అందుబాటులోకి రావడం పట్ల అటు శ్రీవారి భక్తులతో పాటు.. భాగ్యనగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: July 20, 2019, 9:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading