అమరావతిలో 144 సెక్షన్...ఖాకీ నీడలో ఏపీ రాజధాని గ్రామాలు...

రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

news18-telugu
Updated: December 19, 2019, 9:00 AM IST
అమరావతిలో 144 సెక్షన్...ఖాకీ నీడలో ఏపీ రాజధాని గ్రామాలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలను జారీ చేస్తున్నట్లు తుళ్లూరు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలలో రాజధాని అంశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా సచివాలయం వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. తుళ్లూరు, మందడం, మంగళగిరిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. అయితే ఆందోళన కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించాలని ఇప్పటికే పోలీసులు సూచించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమాలపై ఇప్పటికే రాజధాని అమరావతితోపాటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

First published: December 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు