గుంటూరు జిల్లాలో రెండో కరోనా మరణం... అధికారుల కీలక నిర్ణయం

గుంటూరు జిల్లాలో కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య రెండుకు చేరింది.

news18-telugu
Updated: April 11, 2020, 3:03 PM IST
గుంటూరు జిల్లాలో రెండో కరోనా మరణం... అధికారుల కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గుంటూరు జిల్లాలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఓ వ్యక్తి కరోనా కారణంగా చనిపోగా... తాజాగా మరో వ్యక్తి ఈ మహమ్మారి బారిన పడి కన్నుమూశాడు. దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన వ్యక్తి కారణంగా చనిపోయాడు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 71కి చేరుకుంది. ఈ ఒక్క రోజే 14 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు వచ్చిన కేసులలో నలుగురు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు గుంటూరు నగరంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నగరంలోనే 53 పాజిటివ్ కేసులున్నాయి.

నగరంలో ఒకే కుటుంబంలో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. దీంతో అధికారులు నగరంలోని అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేసినట్టు జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ తెలిపారు. రేపు ఆదివారం చికెన్, మటన్ షాపులు సైతం ఉండవని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంచే నిత్యావసరాల విషయంలోనూ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. రేపటి నుంచి రోజు మార్చి రోజు నిత్యావసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తామని తెలిపారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని శ్యామ్యూల్ ఆనంద్ హెచ్చరించారు.

Published by: Kishore Akkaladevi
First published: April 11, 2020, 3:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading