Home /News /andhra-pradesh /

Seaplane : త్వరలోనే విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు -ప్రకాశం బ్యారేజీ నీటిలో ఎయిరోడ్రోమ్: మోదీ సర్కార్

Seaplane : త్వరలోనే విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు -ప్రకాశం బ్యారేజీ నీటిలో ఎయిరోడ్రోమ్: మోదీ సర్కార్

విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు (ప్రతీకాత్మక చిత్రం)

విజయవాడ-హైదరాబాద్ మధ్య సీప్లేన్ సర్వీసులు (ప్రతీకాత్మక చిత్రం)

త్వరలోనే విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సీప్లేన్‌ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విజయవాడ సిటీలోని ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్‌ ఎయిరోడ్రోమ్‌ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ చేపడుతుంది.

ఇంకా చదవండి ...
తెలుగు రాష్ట్రాలకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపులోగానీ, కనీసం విభజన హామీల అమలులోగానీ కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతోన్న క్రమంలో రెండు రాష్ట్రాలకు పనికొచ్చే శుభవార్త వెలువడింది. సాగు చట్టాల రద్దు బిల్లు ఆమోదం సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం, ఏకంగా 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు లాంటి పరిణామాలు జరిగినా, పలువురు ఎంపీలు అడిగిన కీలక ప్రశ్నలకు కేంద్రం క్లారిటీతో కూడిన సమాధానాలు చెప్పింది. ఈక్రమంలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిన ప్రశ్నకు మోదీ సర్కార్ బదులిస్తూ విజయవాడ-హైదరాబాద్ మధ్య త్వరలోనే సీప్లేన్ సర్వీసులు, ప్రకాశం బ్యారీజీలో ఎయిరోడ్రోమ్ నిర్మాణం పూర్తవుతుందని చెప్పింది. వివరాలివి..

త్వరలోనే విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సీప్లేన్‌ సర్వీసు ప్రారంభించడానికి సన్నాహాలు సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విజయవాడ సిటీలోని ప్రకాశం బ్యారేజ్‌లో వాటర్‌ ఎయిరోడ్రోమ్‌ నిర్మాణాన్ని కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, వాటర్‌వేస్‌ మంత్రిత్వ శాఖ చేపడుతుంది. ఈ మేరకు 2021 జూన్‌ 15న ఆ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు.

Godavarikhani: భార్య అక్రమ సంబంధమే అసలు కారణం -యూట్యూబ్‌లో నాపేరు శివ సినిమా చూస్తూ శంకర్‌ను ముక్కలు చేశాడు..



వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ సాధారణ ప్రజలకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులో తీసుకువచ్చేందుకు తమ మంత్రిత్వ శాఖ 2016 అక్టోబర్‌లో రీజనల్‌ కనెక్టివిటీ (ఉడాన్‌) పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే ఈ పథకం మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి అమలులోకి వస్తుందని అన్నారు. వివిధ మార్గాల్లో డిమాండ్‌ ఎలా ఉందో ఎయిర్‌లైన్స్‌ సంస్థలు అధ్యయనం చేసిన అనంతరం ఆయా మార్గాల్లో బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఎయిర్‌లైన్స్‌ ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు.

Karimnagar mlc : కమలంలో ముసలం -బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్ -బీజేపీలోకి సర్దార్ రవీందర్ సింగ్!



ఆ విధంగా ఇప్పటికి నాలుగు రౌండ్ల బిడ్డింగ్‌ అనంతరం విజయవాడ-హైదరాబాద్‌ మధ్య సీప్లేన్‌ సర్వీసుల నిర్వహణకు వాటర్‌ ఎయిరోడ్రోమ్‌ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌ను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. వాటర్‌ ఎయిర్‌డ్రోమ్‌ నిర్మాణం పూర్తయిన అనంతరం ఎంపిక చేసిన ఎయిర్‌లైన్స్‌ సంస్థ రెండు మాసాల్లో సీప్లేన్‌ సర్వీసులను ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. మరి హైదరాబాద్ లో ఎయిరోడ్రోమ్ నిర్మాణం హుస్సేన్ సాగర్ లో ఉంటుందా, మరో చోట ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
Published by:Madhu Kota
First published:

Tags: AP News, Hyderabad, Parliament Winter session, Vijayasai reddy, Vijayawada

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు