సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్... రూట్లు, టైమ్ టేబుల్...

సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గూడూరు మధ్య రెండు సువిధ రైళ్లతో పాటు మరో ప్రత్యేక రైలును కూడా నడపనున్నారు.

news18-telugu
Updated: January 4, 2020, 10:09 AM IST
సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్... రూట్లు, టైమ్ టేబుల్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ, గూడూరు మధ్య రెండు సువిధ రైళ్లతో పాటు మరో ప్రత్యేక రైలును కూడా నడపనున్నారు. ఈ నెల 9న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్య ఓ ప్రత్యేక రైలును నడపనుండగా.. 10న సికింద్రాబాద్ - గూడూరు మధ్య, 11న సికింద్రాబాద్- మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దక్షిణ మధ్య చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ - మచిలీపట్నం-గూడూరు మార్గాల్లో ఈ రైళ్లను అందుబాటులో ఉంచనుంది.

ఈ నెల 9న రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరే సంక్రాంతి స్పెషల్ రైలు 10న ఉదయం 6.45 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోనుంది. దీనికి మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్ జంక్షన్, జనగామ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. అలాగే11న రాత్రి 8.15కి సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సంక్రాంతి ప్రత్యేక సువిధ రైలు 12న ఉదయం 6.50 నిమిషాలకు గూడూరు చేరుకోనుంది. మధ్యలో జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారు. 11న రాత్రి 9.40కి సికింద్రాబాద్ నుంచి బయలేదేరే మరో సువిధ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ మీదుగా 12వ తేదీన ఉదయం 6.05 నిమిషాలకు మచిలీపట‌్నం చేరుకోనుంది.

ఈ మూడు ప్రత్యేక రైళ్లలోనూ ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్,, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్, సెకండ్ క్లాస్ సీట్లను అందుబాటులో ఉంచారు.

ఇవి కూడా చదవండి

జగన్ ఇల్లు జగన్ పేరుతో ఉందా?... డాక్యుమెంట్లు చూపించమంటూ చంద్రబాబు సవాల్...

చీరలో చంపేసిన పునర్నవి... అదిరిన లేటెస్ట్ పిక్స్..




Published by: Ashok Kumar Bonepalli
First published: January 4, 2020, 9:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading