SCHOOLS IN ANDHRA PRADESH WILL REOPEN ON NOVEMBER 2 DECIDED AP GOVERNMENT AK
School Reopening: ఏపీలో స్కూల్స్ ప్రారంభం మళ్లీ వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే..
ఫ్రతీకాత్మక చిత్రం
School Reopening in Andhra Pradesh: అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది.
ఏపీలో పాఠశాలల ప్రారంభించే తేదీ మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 5న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను తెరవాలని భావించిన జగన్ సర్కార్.. మరో నెల రోజుల పాటు ఈ తేదీని వాయిదా వేసింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జగనన్న విద్యా కానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని జగన్ సర్కార్ భావిస్తోంది. ఆ రోజు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేయనున్నారు.
ఏపీలో స్కూల్స్‌ను ప్రారంభించాలని జగన్ సర్కార్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలను మరింతగా మెరుగు పరిచేందుకు నాడు నేడు అనే కార్యక్రమం మొదలుపెట్టిన జగన్ సర్కార్.. ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తోంది. పాఠశాలల పున:ప్రారంభానికి ముందే జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఈసారి పాఠశాలల ప్రారంభానికి ముందే విద్యాకానుకను అమలు చేయాలని నిర్ణయించింది. అందుకే పాఠశాలల పున:ప్రారంభం తేదీ వాయిదా పడినప్పటికీ.. జగనన్న విద్యాకానుకను మాత్రం అక్టోబర్ 5న ప్రారంభించాలని భావిస్తోంది.
విద్యా కానుక కిట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, టెక్ట్స్,నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, నోటు పుస్తకాలు అందించనున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకు నోట్ బుక్స్ చేరుకోగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి నోట్‌బుక్స్, యూనిఫాం, బూట్లు, సాక్సులను కూడిన కిట్‌ను విద్యార్ధులకు ఇచ్చేందుకు అధికారులు సిద్దం చేస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్స్, బూట్లు సహా అన్ని మంచి నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ఆయా స్కూల్స్‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలని సీఎం జగన్ తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.