ఫిట్‌నెస్ లేకపోతే ఫట్టే... స్కూల్ బస్సులపై ఏపీ ప్రభుత్వం దృష్టి...

School Bus : ఏపీలో 12 నుంచీ స్కూళ్లు తెరచుకున్నాయి. మరి స్కూల్ బస్సులు ఫిట్‌గా ఉన్నాయా... సంగతేంటో తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 10:36 AM IST
ఫిట్‌నెస్ లేకపోతే ఫట్టే... స్కూల్ బస్సులపై ఏపీ ప్రభుత్వం దృష్టి...
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 13, 2019, 10:36 AM IST
స్కూళ్లు తెరచుకుంటే చాలు... తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు. పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపడం, బుక్స్ కొనడం, ఫీజులు చెల్లించడం ఇలా ఎన్నో పనులు. ఇంతా చేసి వాళ్లను స్కూళ్లకు పంపిస్తుంటే... చాలా స్కూళ్ల యాజమాన్యాలు... డొక్కు బస్సుల్లో పిల్లల్ని తరలిస్తూ... వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రమాదాల్ని మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై ముందుగానే అప్రమత్తమైన ఏపీ వైసీపీ ప్రభుత్వం... స్కూల్ బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ పొందేందుకు ఇవాళే చివరి రోజు అని మరోసారి గుర్తు చేసింది. ఇవాళ సాయంత్రం వరకూ ఫిట్‌నెస్ నిరూపించుకోవచ్చని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.

శుక్రవారం నుంచీ ఫిట్ నెస్ లేని బస్సులపై చర్యలు తీసుకుంటామనీ, సీజ్ చేస్తామనీ పేర్ని నాని తెలిపారు. నిన్నటి వరకూ ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందనీ... గత టీడీపీ ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఏ స్కూల్ యాజమాన్యాలైనా, తమ పార్టీ వాళ్లు... ఆ యాజమాన్యాల్లో ఉన్నా... ఫిట్ నెస్ లేని బస్సులు నడిపితే సీజ్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు.

సీఎం ఆదేశాల ప్రకారం చాలా అప్రమత్తంగా ఉన్నామన్న పేర్ని నాని... ఫిట్ నెస్ లేని బస్సుల సమాచారం ఇవ్వమని ప్రజలను కోరారు. అలాంటి బస్సులపై విద్యా శాఖ, రవాణా శాఖ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటాయని తెలిపారు.

 ఇవి కూడా చదవండి :

Pics : బ్యూటీ విత్ బ్రెయిన్... అందాల విందు... ఆపై బిజినెస్... కైలీ జెన్నర్...


కొబ్బరి నీళ్లతో 20 రకాల ప్రయోజనాలు... తాగితే రోగాలు దరిచేరవు
Loading...
లవంగాలు మనకు ఎంత మేలు చేస్తున్నాయో తెలుసా... ఎన్ని ప్రయోజనాలో... రోజూ తినాల్సిందే.

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...
First published: June 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...