హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

School Girl Humanity: రోడ్డుపై గర్భిణీ అవస్థలు.. చలించి పోయిన చిన్నారి.. ఏం చేసిందంటే..? వీడియోలో చూడండి

School Girl Humanity: రోడ్డుపై గర్భిణీ అవస్థలు.. చలించి పోయిన చిన్నారి.. ఏం చేసిందంటే..? వీడియోలో చూడండి

గర్భిణికి సాయం చేసిన చిన్నారి

గర్భిణికి సాయం చేసిన చిన్నారి

School Girl Humanity: మనుషులో రోజు రోజుకూ మానవత్వం నశిచిపోతోంది.. అసలు మనిషి అన్నవాడే మాయం అయిపోతున్నాడు. నడి రోడ్డుపై మరో మనిషి సాయం కోసం ఎదురు చూస్తున్నా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు అంతా. ఇలాంటి రోజుల్లో ఓ చిన్నారి చూపించిన మానవత్వం అందరితో మన్ననలు అందుకునేలా చేస్తోంది.

ఇంకా చదవండి ...

Andhra Pradesh School Girl Helping: ప్రస్తుతం సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మనుషుల్లో మానవత్వం నశిచిపోతోంది. తోటి మనిషికి సాయం చేయాలి అనే సంగతి అంతా మరిచిపోతున్నారు. రోడ్డుపై అంతా వెళ్తుంటే.. అక్కడ ఓ మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ఎవరూ పట్టించుకోరు. కొంతమంది అయితే దారుణంగా సెల్ఫీలు తీసుకుని వెళ్తారు.. కానీ అసలు సాయం చేద్దాం.. ప్రాణాలు కాపాడుకోవాలి అనుకోరు. సాయం చేయండి అని వేడుకున్నా పట్టించుకోరు.. దాహం వేస్తోంది నీళ్లు ఇవ్వండి అన్న పట్టించుకోని రోజులు ఇవి.. మనకెందుకు.. మన పని మనం చూసుకుందాం అనుకునే వారు ఎక్కువమంది ఉంది. కానీ ఇలాంటి సమయంలో అనంతపురం జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. అది కూడా ఓ చిన్నారి చూపిన ఔదార్యం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఆటోలో ఓ నిండు గర్భిణి ఆస్పత్రికి బయల్దేరింది. అయితే మార్గం మధ్యలో అనుకోకుండా ఆటోకి రిపేర్‌ అయ్యింది. అయితే ఆమె అప్పటికే నొప్పులు పడుతోంది. డ్రైవర్ వెంటనే ఆటోను ఆపీ సాయం కోసం అందర్నీ పిలుస్తున్నాడు. ఎవరైనా వచ్చి ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నాడు. రోడ్డు మధ్యలో ఆటోలో ఆ గర్భిణీ పురిటి నొప్పులతో అల్లాడిపోతుంది..ఆమెను ఎలాగైన ఆస్పత్రికి తరలించేందుకు ఆటోడ్రైవర్‌ ప్రయత్నిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డుపై వచ్చేపోయే వాహనాలను ఆపి సాయ చేయాలని కోరుతున్నా ఒక్కరి కూడా కనికరించడం లేదు. ఆ గర్భిణికి సహకరించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అటు వైపు చాలానే వాహనాలు వెళ్తున్నాయి కానీ ఒక్కరు అంటే ఒక్కరు కూడా వాహనాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.

అయితే అదే సమయంలో అటువైపు కారులో తల్లిదండ్రులతో పాటు స్కూల్‌కి వెళ్తోన్న ఓ చిన్నారి, ఆటోలో ఉన్న మహిళను గమనించింది.. వెంటనే ముందుకు వెళ్లిపోయిన కారుని తిరిగి వెనక్కి తీసుకెళ్లమని చెప్పింది. ఆ తరువాత ఆ చిన్నారి కారు దిగివచ్చి ఆటోలో ఉన్న మహిళలను పరామర్శించింది.. తన స్కూల్‌ బ్యాగ్‌లో ఉన్న వాటర్‌ బాటిల్ తెచ్చి ఆమెకు దాహం తీర్చింది.. పాపం ప్రసవ వేధనతో ఆ గర్బిణీ అవస్థపడుతుంది.. ఏం చేయాలో తెలియని ఆ చిట్టి హృదయం గొప్ప సాయం చేసింది..



వాటర్ ఇచ్చి చేతులు దులుపుకోలేదు. వెంటనే కారులో ఉన్న తమ వారిని పిలిచి.. మహిళకు సాయం చేయాలని కోరింది.. ఆటో డ్రైవర్‌, కారులో ఉన్న వ్యక్తి ఇద్దరు కలిసి గర్భిణీని చేతులపై మోసుకోని కారులోకి తరలించారు.. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్‌ తన ఆటోను రిపేర్‌ చేయించున్నాడు.. ఇదంతా సినిమా కాదు.. అనంతపురం జిల్లాలో జరిగిన యదార్థ ఘటన.. ఇదంతా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డైంది.. డిసెంబర్‌ 2న ఈ ఘటన జరిగినట్లుగా తెలిసింది. చిన్నారిని చూసైనా మనుషులంతా మానవత్వం చూపిస్తే బాగుటుంది..

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News

ఉత్తమ కథలు