హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap-Telangana: మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

Ap-Telangana: మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా..షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

ఈసీ

ఈసీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఈసీ (Election Commission) రిలీజ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election Shedule)కు నగారా మోగింది. మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ఈసీ (Election Commission) రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇక ఈసీ (Election Commission) రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 13న పోలింగ్, మార్చి 16న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఏపీలో 3 పట్టభద్రుల స్థానాలు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 8 స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలో ఒక స్థానిక సంస్థకు, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి (MLC Election Shedule) ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది.

Ap: నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత..మైక్ లాక్కున్న పోలీసులు..స్టూల్ పై నిలబడి లోకేష్ నిరసన

ఏపీలో ఎన్నికలు జరిగే పట్టభధ్రుల స్థానాలు ఇవే..

ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు

కడప- అనంతపురం- కర్నూల్

శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఏపీలో ఎన్నికలు జరిగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ఇలా..

ప్రకాశం నెల్లూరు చిత్తూరు

కడప అనంతపురం కర్నూల్

ఏపీలో 8 స్థానిక సంస్థల ఎన్నికలు..

పశ్చిమ గోదావరి

తూర్పుగోదావరి

నెల్లూరు

కడప

అనంతపురం

శ్రీకాకుళం

చిత్తూరు

కర్నూల్

Crime News: హైదరాబాద్ లో వ్యక్తి దారుణ హత్య..పట్టపగలే కత్తులతో..

తెలంగాణలో ఎన్నికలు జరిగే స్థానాలు..

ఇక తెలంగాణలో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రిలీజ్ అయింది.

స్థానిక సంస్థల ఎన్నిక జరిగే ఒకే స్థానం : హైదరాబాద్

ఏపీలో 13, తెలంగాణలో 2 స్థానాలకు మొత్తం 15 స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను  (MLC Election Shedule) ఎలెక్షన్ కమీషన్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని రెండు స్థానాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వారి పదవీకాలం త్వరలోనే ముగియనుండటంతో ఈసి (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుండి దీపక్ రెడ్డి, కడప నుండి బిటెక్ రవిల పదవీకాలం మర్చి 29న ముగియనుంది. ఇక నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి, పశ్చిమ గోదావరి నుండి రామ్మోహన్ రావు, మంతెన సత్యనారాణయన రాజు, తూర్పు గోదావరి చిక్కాల రామచంద్రరావు, చిత్తూరు రాజనర్సింహులు, కర్నూల్ నుండి ప్రభాకర్ పదవి కాలం మే 1తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈసీ (Election Commission) షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇక ఏపీలోని పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పదవి గడువు మార్చ్ 29తో ముగియనుండటంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.

First published:

Tags: Ap, Ap mlc elections, Election Commission of India, Mlc elections, Telangana, Telangana mlc election

ఉత్తమ కథలు