పవన్ కళ్యాణ్ ట్వీట్... విమలక్క సాంగ్‌కి జనసేనాని సలాం

#SaveNallamala : సేవ్ నల్లమల ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. బతుకమ్మ సంబురాలు కూడా ఉద్యమంలో భాగమైపోవడం హర్షదాయకం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 29, 2019, 9:05 AM IST
పవన్ కళ్యాణ్ ట్వీట్... విమలక్క సాంగ్‌కి జనసేనాని సలాం
పవన్ కళ్యాణ్ ట్వీట్... విమలక్క సాంగ్‌కి జనసేనాని సలాం (Credit - Twitter - Pawan Kalyan)
  • Share this:
Pawan Kalyan : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు ఒప్పుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసినా... కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ఫలితంగా తెలంగాణ ప్రజలు... ఎంతో ఆనందంగా, కష్టాలన్నీ మర్చిపోయి... సంతోషంగా జరుపుకోవాల్సిన బతుకమ్మ సంబరాలను కూడా సేవ్ నల్లమల ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తున్నారు. బతుకమ్మ పాటల్లో సేవ్ నల్లమల వినిపిస్తోంది. బతుకమ్మ ఆటల్లో సేవ్ నల్లమల్ల ప్రతిధ్వనిస్తోంది. ఊరూ వాడా అందరూ నల్లమల అడవుల్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ క్రమంలో విమలక్క ప్రత్యేక సేవ్ నల్లమల సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నా... అడుగడుగునా... నల్లమలను కాపాడుకుంటామనే నినాదాలే వినిపించాయి. ఈ సాంగ్ ఎంతో ఇన్స్‌పిరేషన్ ఇస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.First published: September 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>