Home /News /andhra-pradesh /

SATYA SAI DISTRICT COLLECTOR GO VISIT TO HOW TO DO WORKS GO ON BY BYKE NGS

Collector on Byke: కూలీలను ఆశ్చర్యపరిచిన కలెక్టర్.. గ్రామీణ ఉపాధి హామీ పనుల పరిశీలనకు ఏం చేశారంటే..?

బైక్ పై జిల్లా కలెక్టర్

బైక్ పై జిల్లా కలెక్టర్

Collector on Byke: ఉపాధి హామీ పనుల పనితీరి ఎలా ఉంది..? పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా..? కార్మికులు పనులకు వస్తున్నారా.. లేదా? ఇలా అన్ని విషయాలు ఆరా తీయడానికి కొత్తగా ఏర్పైట సత్యసాయి జిల్లా కలెక్టర్ చేసిన పని చూస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
    Collector on Byke:  జిల్లా కలెక్టర్ (District Collector) అంటే.. కాలు తీసి అడుగు బయట పెట్టారంటే కారు ఉండాల్సిందే.. అది కూడా ఏసీ కారు (AC Car).. ఒక్క అడుగు కూడా ఆయన బయటకు వేయక్కర్లేదు.. నేరుగా కార్యాలయంలో దిగి.. మళ్లీ అక్కడే ఎక్కే సౌకర్యం ఉంటుంది. మాడు పగిలే ఎండల సమయంలో కార్యాలయంలో ఉన్న సమయంలో మినహా.. కారు దిగాల్సిన అసవరం ఉండదేమో.. చాలామంది కలెక్టర్లు ఈ వేసవిలో.. అది కూడా సుర్రు మంటూ సమ్మర్ ఫ్రై చేస్తున్న సమయంలో బయటకు వెళ్లాలి అంటే.. అత్యవసరం అయితే తప్ప ఆ పని చేయరు. కానీ ఈ కలెక్టర్ వారికి చాలా భిన్నం.. ఆయన చేసిన పని చూస్తే షాక్ అవుతారు. ఇక అక్కడ పని చేస్తున్న కార్మికులు అయితే ఆ కలెక్టర్ చేసిన పని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.. జిల్లా కలెక్టర్లు ఇలా కూడా వస్తారా అని నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ ఆ కొత్త జిల్లా కలెక్టర్ ఏం చేశారంటే..?

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పాటైన సత్యసాయి జిల్లా కలెక్టర్ గా బసంత్ కుమార్ ( Collector Basanth Kumar) బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా (Sristaysai District) కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామం లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ద్విచక్ర వాహనంపై వెళ్లి కలెక్టర్ బసంత్ కుమార్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరు, నీడ,నీరు వంటి సౌకర్యాల పై అడిగి తెలుసుకున్నారు.

    ఇదీ చదవండి : మంత్రి పదవి నుంచి ఎందుకు పక్కన పెట్టారంటే..? ముందస్తు ఎన్నికలపై కొడాలి నాని క్లారిటీ

    కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనే ఇలాగే ప్రజలకు చేరువగా వెళ్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుని.. ఇబ్బందులు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన సలహాలు కూడా ఇస్తున్నారు. తాజాగా పని ప్రదేశాలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో లోటుపాట్లు రాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పని వేళలు కూడా అవసరానికి తగ్గట్టు ఉపోయోగించుకుంటే మంచిది అని సూచించారు.

    ఇదీ చదవండి : ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఫిక్స్.. రేపు సీఎం ప్రకటించే ఛాన్స్! ఇంతకీ ఎవరంటే?

    ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా అగ్రస్థానంలో ఉండేలా చూడాలని, పని కల్పించాలని కోరిన ప్రతి కూలీకి పని చూపించాలని సూచనలు చేశారు. రైతులు ఫారం పాండ్ తవ్వకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఫారం పాండ్ లను తవ్వుకుంటే ఒనగూరే ప్రయోజనాలు ప్రభుత్వం నుంచి చేకూరే లబ్ధి పై అధికారులు అవగాహన కల్పించాలని సూచనలు చేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Collector

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు