Home /News /andhra-pradesh /

SARPANCH WAS FINED RS 5000 FOR WASTING COURT TIME EVK

Ap High Court: కోర్టు స‌మ‌యం వృథా చేశారు.. రూ.5000 కట్టండి : ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

ఉపాధి హామీ పథకం పనులకు చెల్లించాల్సిన నిధులను చెల్లించకుండా నిలిపి ఉంచిన సర్పంచ్ చెక్ పవర్(Check Power) ను జిల్లా అధికారులు నిలిపి వేశారు. దీనిపై కోర్టు సర్పంచ్(Sarpanch) కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు(High Court) సమయం వృథా చేసినట్టుగా అభిప్రాయ పడింది.

ఇంకా చదవండి ...
    గుంటూరు జిల్లా నూజెండ్ల మండ‌లం వి.అప్పారపురం స‌ర్పంచ్ కె.రోజారాణి గ్రామ స‌చివాల‌యం నిర్మాణానికి  వచ్చిన ఉపాధి నిధులను కాంట్రాక్ట‌ర్‌కు చెల్లించ లేదు. దీనికి వివ‌ర‌ణ కోరుతూ జిల్లా పంచాయ‌తీ అధికారి స‌ర్పంచ్‌(Sarpanch)కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఉన్న‌తాకారులు నోటీస‌ల‌కు స్పందించ‌నందుకు ఆమె చెక్ ప‌వ‌ర్‌ను(Check power) మూడు నెల‌ల పాటు ర‌ద్దు చేస్తు జిల్లా అధికారి ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఉత్త‌ర్వుల‌ను స‌వాలు చేస్తు ఆమె హైకోర్టు(High Court) లో పిటిష‌న్ వేశారు. దీనిపై హైకోర్టు విచార‌ణ చేప్టింది.
    గ్రామ స‌చివాల‌య భ‌వ‌న నిర్మాణంపై గ్రామ‌స్తుల నుంచి ఫిర్యాదు అందింద‌ని , నిర్మాణ ప‌నుల‌కు సంబంధించిన రికార్డులు త‌న‌వద్ద లేవ‌ని.. కావున నిధులు చెల్లించ‌లేన‌ని స‌ర్పంచ్ పిటిష‌న్‌(Petition)లో పేర్కొన్నారు. దీనిపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.
    జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం ప‌నుల‌కు చెల్లించాల్సిన నిధుల్లి స‌ర్పంచ్ ఆపి ఉంచ‌డం స‌రికాదు అని పేర్కొంది.

    AP Special Status: రాజ‌ధాని కోల్పోయిన ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వండి: వాణిజ్యశాఖ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు


    స‌ర్పంచ్‌గా ఎన్న‌క కాక ముందు జ‌నిగిన ప‌నుల‌కు నిధులు చెల్లించేందుకు వ‌చ్చిన నిధులను అపే అధికారం మీకు ఎక్క‌డిద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. గ‌తంలో నిర్వ‌హించిన ఉపాధి ప‌నుల బ‌కాల‌యిలు చెల్లించాల‌ని హైకోర్టు ఇచ్చ‌ని ఆదేశాల‌కు అడ్డుప‌డేలా స‌ర్పంచ్ చ‌ర్య‌లు ఉన్నాయ‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. నిధులు చెల్లంచ‌లేను అనే స‌ర్పంచ్ వాద‌న‌ను కోర్టు తోసిపుచ్చింది.
    స‌ర్పంచ్ తీరును సుమోటోగా కోర్టు ధిక్క‌ర‌ణ చ‌ర్య‌లు ప్రారంభిస్తామ‌ని హెచ్చ‌రించింది. దీంతో స‌ర్పంచ్ త‌రుపు న్యాయ‌వాది వ్యాజ్యం ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరారు. అందుకు అంగీక‌రించిన జ‌డ్జి కోర్టు స‌మయాన్ని వృథా చేసినందుకు ఏపీ న్యాయ సేవాధికార సంస్థ‌కు రెండువారాల్లోగా రూ. 5000 ఖ‌ర్చుల నిమిత్తం చెల్లించాల‌ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బ‌ట్టు దేవానంద్ ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు