హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Spl Trains | సికింద్రాబాద్ - విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్... డేట్, టైమ్, ఫుల్ డిటెయిల్స్...

Spl Trains | సికింద్రాబాద్ - విశాఖ మధ్య స్పెషల్ ట్రైన్స్... డేట్, టైమ్, ఫుల్ డిటెయిల్స్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లను నడుపుతోంది.

సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ఈ రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని 8 రైళ్లు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది

08523 నెంబర్ స్పెషల్ ట్రైన్ ఈనెల 12న, 19 వ తేదీల్లో విశాఖ నుంచి బయలుదేరుతుంది. తర్వాత రోజు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.

08524 నెంబర్ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి 13, 20వ తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాత రోజు తెల్లవారుజామున 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

ఇందులో ఏసీ 3 టైర్, ఏసీ 2 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

08525 నెంబర్ ప్రత్యేక రైలు విశాఖపట్నం నుంచి ఈనెల 12, 19వ తేదీల్లో ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

08526 నెంబర్ ప్రత్యేక రైలు విజయవాడ నుంచి ఈనెల 12, 19 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ విశాఖ - విజయవాడ - విశాఖ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్ల కోట, రాజమండ్రి, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలో ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు ఉంటాయి.

వీటితోపాటు 82751 నెంబర్ గల సువిధ స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి ఈనెల 11న సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4.30 గంటలకు నెల్లూరు చేరుకుంటుంది.

ఈ సువిధ స్పెషల్ రైలు కాజీపేట, వరంగల్, విజయవాడ, తెనాలి, ఒంగోలు స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఏసీ 2టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

First published:

Tags: Andhra Pradesh, Indian Railways, South Central Railways, Telangana

ఉత్తమ కథలు