సంక్రాంతి వేళ సికింద్రాబాద్-నెల్లూరు మధ్య స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే

సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-నెల్లూరు లైన్‌లో 2 రైళ్లు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది

news18-telugu
Updated: January 10, 2020, 8:26 PM IST
సంక్రాంతి వేళ సికింద్రాబాద్-నెల్లూరు మధ్య స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-నెల్లూరు లైన్‌లో 2 రైళ్లు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది
  • Share this:
సంక్రాంతి పండుగకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం రూట్‌తో పాటు సికింద్రాబాద్-నెల్లూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్-నెల్లూరు లైన్‌లో 2 రైళ్లు ప్రత్యేకంగా నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది

82751 నెంబర్ సువిధ స్పెషల్ ట్రైన్:

ఈ రైలు సికింద్రాబాద్‌లో జనవరి 12న సాయంత్రం 04.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 04.50కి నెల్లూరు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు మీదుగా ఈ రైలు నెల్లూరు వెళ్తుంది. ఇందులో ఏసీ 2టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.


02710 నెంబర్ స్పెషల్ ట్రైన్:
ఈ రైలు జనవరి సికింద్రాబాద్‌లో జనవరి 13న రాత్రి 09.40 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 06.15కి గూడూరుకు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ఈ రైలు గూడూరు వెళ్తుంది. ఇందులో ఏసీ 2టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

Published by: Shiva Kumar Addula
First published: January 10, 2020, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading