SANKRANTI SPECIAL 400 METER BHOGI DANDA MADE FOR KONASEEMA PEOPLE THERE IS SOME SIGNIFICANCE NGS
Sankranti: సంక్రాంతి పండగ అంటే అర్థం ఇదే.. స్పెషల్ గా నిలిచిన 400 అడుగుల భోగీ దండ.. ప్రత్యేకత ఏంటంటే..?
400 మీటర్ల భోగీ దండ
Sankranti: ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద పండుగ సంక్రాంతి.. అందుకే ఎవరు ఎక్కడ ఉన్నా.. సంక్రాంతికి సొంతూరుకు చేరుకుంటారు.. ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.. ఊరు వాడా అంతా కలిసి సంబరాల్లో పాల్గొంటారు.. మూడు రోజుల పాటు సాంప్రదాయంగా జరుపుకునే ఈ పండగ అంటే ఇష్టపడని వారు ఉండరు.. అయితే ఓ గ్రామం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. తామంతా ఒకటే అని నిరూపిస్తూ వినూత్నంగా వేడుకలు చేసుకున్నారు.
Makar Sankranti: తెలుగు ప్రజలు ఆనందంగా వేడుకగా జరుపుకున్న పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti). కేవలం ఒక రోజే కాదు.. పండు మూడు రోజులంటే.. అటు మూడు రోజులు.. ఇటు మూడు రోజులు సందడి ఉంటుంది. చదువు, ఉపాధి, ఉద్యోగం, వ్యాపారం ఇలా వివద ప్రాంతాల్లో.. ఆఖరికి విదేశాల్లో ఉన్నవారు సైతం.. కచ్చితంగా సంక్రాంతికి సొంతూరుకు రావాలని కోరుకుంటారు. చిన్ననాటి గుర్తులను నెమరవేసుకుని పండుగను జరుపుకునేందుకు సొంత ఊళ్లకు చేసుకుంటారు. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల తో కలిసి సంతోషంగా సంక్రాంతి (Sankranti) వేడుకలలో పాల్గొంటారు. ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. ఇక సంక్రాంతి అంటే తెలుగువారి అందరికీ గుర్తుకోచ్చేంది కోనసీమ (Konaseema). ధనుర్మాసం (Dhanurmasam) మొదలైందంటే చాలు ఇక్కడ ప్రతి ఇంట్లో పండగ వచ్చెసినట్లే. కొని ప్రాంతాల్లో వారం రోజుల ముందునుంచే సంక్రాంతి శోభ కనిపిస్తే.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నెలరోజుల ముందు నుంచే సంక్రాంతి అప్పుడే వచ్చిసిందనేలా వాతావరణం ఉంటుంది. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో మొదలవుతాయి. చిన్న పిల్లలు ఉన్నవారు భోగి పండగ కోసం ఆవు పేడతో భోగిపిడకలు చేస్తారు. అలాగే పేడ పిడకలను దండగా కూర్చి మంటల్లో వేసి పిల్లలకు దిష్టి తీస్తారు.. ఇలా పెద్ద పండుగకు ఎన్నో ప్రత్యేకలు ఉంటాయి. అంతేకాదు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను చాటి చెప్పే పండుగ కూడా ఇదే..
భోగి, సంక్రాంతి, కనుమతో పాటు.. నాల్గో రోజున ముక్కనుమగా కోనసీమ వాసులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి లో మొదటి రోజు భోగి పండగగా జరుకుంటారు భోగీ అంటే సాయంత్ర పూట పిల్లలకు భోగీ పండ్లు పోయడం ఒక ఆనవాయితీ అయితే.. తెల్లవారు జామునే భోగీ మంటలు వేయడం మరో ప్ర్తత్యేకత. అలా వేసిన భోగి మంటల్లో భోగి దండలను వేయడం కూడా కొన్ని చోట్ల ఆనవాయితీ.. ఈ మంట కోసం పిల్లలు పెద్దలు తెల్లవారు జామునే నిద్ర లేచి.. అభ్యంగస్నానాలు చేస్తారు. కొత్త బట్టలు కట్టుకుని ఈ భోగి దండలను తీసుకుని మంటల్లో వేసి.. వస్తారు. ఇలా భోగి దండను మంటల్లో వేసేందుకు ఓ గ్రామస్తులు. సుమారు 400 మీటర్ల మేరకు గుచ్చి.. రికార్డ్ సృష్టించారు.
తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఏకంగా భోగి దండను 400 అడుగుల మేర గుచ్చారు. ఈ దండను రెడీ చేయడానికి ఊరంతా ఏకమైంది. పెద్దలు, పిల్లలు కలిసి నెల రోజుల నుంచి భోగి పిడకలను తయారు చేసి దానిని దండగా గుచ్చి.. భోగి పండగ రోజున పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అనే తేడా లేకుండా ఊరంతా కలిసి సంబరంగా ఆ దండను భోగి మంట దగ్గరకు మోసుకుని వచ్చారు. ఆ దండను భోగి మంటల్లో వేసి.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలని కోరుకున్నారు. పండగ అంటేనే పది మంది కలిసి చేసుకునేది అని అర్ధం.. అయితే ఈ గ్రామం ఇంకొంచెం ముందుకు వెళ్ళి.. సంక్రాంతి అంటేనే .. ఊరంతా కలిసి చేసుకునేది అనే కొత్త అర్ధం చెప్పి అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.