పల్లెకు పోయిన పట్నం... హైదరాబాద్ రోడ్లు ఖాళీ

స్కూళ్లు, కాలేజీలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించడం వాటికి శని, ఆదివారాలు కూడా తోడవ్వడంతో ఐదు రోజులు సెలవులు సంక్రాంతి పండుగకు కలిసి వచ్చాయి.దీంతో ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు.

news18-telugu
Updated: January 13, 2019, 11:00 AM IST
పల్లెకు పోయిన పట్నం... హైదరాబాద్ రోడ్లు ఖాళీ
నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ రోడ్డు
news18-telugu
Updated: January 13, 2019, 11:00 AM IST
ఎప్పుడు బిజీ బిజీగా ఉండే భాగ్యనగర రోడ్లు ఖాళీ అయ్యాయి. ట్రాఫిక్ అస్సలు లేదు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్‌కు కూడా పెద్దగా పని లేదు. హైదరాబాద్ సిటీ అంతా నిర్మానుష్యంగా మారిపోయింది. సంక్రాంతి సెలవులను ఎంజాయ్ చేసేందుకు పట్నం వాసులంతా పల్లెలకు క్యూ కట్టారు. ఏడాదిపాటు కన్నవారికి, కుటుంబసభ్యులకు దూరంగా ఉండే వాళ్లంతా పెద్ద పండగను అందరితోకలిసి జరపుకునేందుకు తరలివెళ్లారు. సంక్రాంతి అంటేనే హైదరాబాద్‌ సిటీ ఖాళీ అయిపోతుంది. స్కూళ్లు, కాలేజీలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించడం వాటికి శని, ఆదివారాలు కూడా తోడవ్వడంతో ఐదు రోజులు సెలవులు సంక్రాంతి పండుగకు కలిసి వచ్చాయి.దీంతో ఈ ఏడాది భారీగా జనం పల్లెలకు క్యూ కట్టారు.

ఏడాది పొడవునా కన్నవారికి వున్న వూరికి దూరంగా వుండే వారంతా సంక్రాంతి పండుగకి సొంత గూటికి చేరే ప్రయత్నాల్లో నరకం చవి చూసారు. బస్సు, రైలు, సొంత వాహనం ఇవేవి కాకుండా విమానాలు ఆశ్రయించిన వారికి చుక్కలు కనిపించాయి. ప్రభుత్వ, ప్రయివేట్ బస్సులు వేలసంఖ్యలో ఏర్పాటు చేసినా ప్రయాణికులు లక్షల్లో వుండేటప్పటికీ అంతా చేతులు ఎత్తేయాలిసివచ్చింది. బస్సుల్లో కూడా మూడు నాలుగు రేట్లు అధిక ధరలకు టికెట్లు పెంచడం తో పండగ పూర్తి కాకుండానే కుటుంబ సమేతంగా బయల్దేరిన వారి జేబులు ఖాళీ అయిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ ఇసుక వేస్తే రాలనంత మంది ఉండటంతో ప్రత్యక్ష నరకానికి ప్రయాణికులు గురయ్యారు. ఇక విమానాల ధరలు ఆకాశాన్ని తాకాయి. సొంత వాహనాల్లో బయల్దేరిన వారికి టోల్ గేట్లు ట్రాఫిక్ జామ్ లు మరో రకమైన హింసను చవిచూపించాయి.

దీంతో ఎప్పుడు ట్రాఫిక్ జామ్ లతో కిక్కిరిసి పోయి కనిపించే హైదరాబాద్ రొటీన్ కి భిన్నంగా ఈ నాలుగు రోజులు కనిపిస్తుంది. నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జనం అలికిడి కనిపించదు, వాహనాలు సౌండ్ పొల్యూషన్ కూడా అస్సలు ఉండదు. . తెలుగురాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాజధాని ఉద్యోగాలకు అందరికి కేంద్ర బిందువుగా ఉన్న భాగ్యనగర్ నుంచి సంక్రాంతికి భారీగా తరలిరావడం దశాబ్దాలుగా వస్తుంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు హైదరాబాద్‌ నుంచి ఏపీతో పాటు... నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు హైదరాబాదీలు క్యూ కడ్తుంటారు. ప్రస్తుతం వాహనాల తాకిడి హైదరాబాద్‌ విజయవాడ ప్రధాన రహదారిపై పెరిగింది. గతానుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈజీ ట్రాఫిక్‌ ఫ్లో ఉండేలా అదనపు సిబ్బందిని మోహరించారు.

ఇవికూడా చదవండి :Makar sankranti 2019: ఈ ప్రాంతాల్లో జరిగే సంక్రాంతి సంబరాలను చూసి తీరాల్సిందే..

Makar Sankranti 2019: సకుటుంబ ‘సంక్రాంతి’ సమేతంగా..
First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...