Balayya Sankranti Celbrations: మారు మూల గ్రామం నుంచి మహా నగరాల వరకు ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలుగు ప్రజల అతి పెద్ద పండుగగా గుర్తింపు పొందిన సంక్రాంతి సంబరాలు ఈ ఏడాది ఇంకాస్త వైభంగా జరుగుతున్నాయి. స్కూళ్లకు సెలవులు, వర్క్ ఫ్రం హోం పేరుతో ఎక్కడెక్కడ ఉన్నవారు సైతం ఇప్పుడు సొంతూళ్ల బాట పట్టారు. కరోనా నేర్పిన పాఠాలతో సొంత వారికి దగ్గరగా ఉండాలని అంతా భావిస్తున్నారు. సాంప్రదాయ వేడుకలకు నెలవు అందుకే ఎక్కడ ఉన్నా.. అయినవారితో వేడుకలను చేసుకోవాలని అంతా భావిస్తున్నారు. సినిరంగానికి చెందిన పెద్ద హీరోలు సైతం తమ పనులన్నీ పక్కకు పెట్టి.. తమ కుటుంబ సభ్యుల మధ్యకు చేరుకుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దంపతులు ప్రకాశం జిల్లాలోని తన అక్క దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ సభ్యులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
బాలయ్య కుటుంబం రాకతో దగ్గుబాటి పురందేశ్వరి ఇంటి దగ్గర సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి పండగను బాలకృష్ణ కారంచేడు లోని సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ఇంట్లో సందడి చేస్తున్నారు. బాలయ్య తన భార్య వసుంధర, కొడుకు మోక్షజ్ఞ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి వేడుకలు జరుపుకుంతున్నారు. అయితే బాలయ్య నాచ్ ఘోడ గుర్రమెక్కి కొద్దిసేపు కుటుంబసభ్యులను అలరించారు. తరువాత బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గుర్రం ఎక్కగా.. బాలకృష్ణ గుర్రం కళ్ళెం పట్టుకుని అదుపుచేశారు. బాలకృష్ణ విన్యాసాలు చూసేందుకు భారీగా అభిమానులు హాజరయ్యారు.
Sankranti Celebrations||అక్క పురందేశ్వరి ఇంట్లో బాలయ్య సంక్రాంతి సందడి||... https://t.co/17VyLudbOg via @YouTube #Balayya #Balakrishna
— nagesh paina (@PainaNagesh) January 15, 2022
భోగీ కంటే ముందుగానే ఈ సారి బాలయ్య తన అక్క ఇంటికి వచ్చారు.. భోగీ మంటలతో సందడి చేశారు. బాలయ్య బంధువులతో కలిసి ఊరంతా కలియతిరిగారు. ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు.. ప్రస్తుతం అఖండ సూపర్ హిట్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి.. అక్కబావలపై మమకారం చూపించారు.. అందుకే పండుగ వేడుకలను తొలిసారి పురందేశ్వరి ఇంట్లో జరుపుకుంటున్నారు.
బాలకృష్ణ తమ ఊరు వచ్చాడని తెలియడంతో.. ఆయన్నుచూడడానికి స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో దగ్గుబాటి నివాసానికి చేరుకున్నారు. అయితే కోవిడ్ నేపధ్యంలో ఇంటిలోపలకు ఎవరిని అనుమతించలేదు. అయనా ప్రహారీ గోడ బయటే నిలబడి బాలయ్యను చూసి అభిమానులు పొంగిపొయారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
బాలయ్య - పురందేశ్వరిలో అక్కా, తమ్ముడూ అయినా గత ఎన్నికల వరకు దూరం దూరంగానే ఉండేవారు.. రాజకీయంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారు.. అసలు ఒకరిని చూసి ఒకరు పలకరించుకోవడం కూడా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది.
సంక్రాంతి సంబరాల కోసమని నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ, మరికొంత మంది దగ్గుబాటి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది బాలకృష్ణ దంపతులతో పాటు జయకృష్ణ, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారంతా గురువారం కారంచేడుకు చేరుకున్నారు. నిన్న భోగి వేడుకల్లో సందడి చేసిన బాలయ్య.. సంక్రాంతి సందర్భంగా ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.. ఇక, బాలయ్య గుర్పంపై స్వారీ అందరినీ ఆకట్టుకుంది.. గుర్రంపై బాలయ్య కూర్చొని ఉండగా.. ఆ గుర్రంతో డ్యాన్స్ వేయించారు.. ఓ పాటను పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తుండగా.. లయబద్ధంగా గుర్రం స్టెప్పులు వేసింది.. ఇక, గుర్రంపై ఫుల్ జోష్‌తో కనిపించారు బాలయ్య.. ఓ వైపు బాలయ్యను కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండగా.. మరోవైపు.. అభిమానులు కూడా జై బాలయ్య.. జై జై బాలయ్య నినాదాలతో హోరెత్తించారు..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Nandamuri Mokshagna