ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే...

ఏపీలో సంక్రాంతి సెలవులు ఇవే...

ప్రతీకాత్మక చిత్రం

మొత్తం మీద పండగకు పదిరోజుల పాటు సెలవులు రావడంతో పిల్లలు సంబరపడిపోతున్నారు.

  • Share this:
    పెద్దలు పిల్లలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంక్రాంతి రానే వచ్చేస్తోంది. ఆ పెద్ద పండగకు ముందు మరో పండగ కూడా ఉంది అదే క్రిస్మిస్. అయితే ఏపీ ప్రభుత్వం సంక్రాంతి, క్రిస్మస్ సెలవులకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించింది.  రాష్ట్రంలోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 20 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. మిషనరీ పాఠశాలలకు డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్‌ సెలవులు ఇచ్ఛారు. విద్యాశాఖ తన అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈ మేరకు ప్రకటించింది. జూనియర్‌ కాలేజీలకు జనవరి 11 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. మొత్తం మీద పండగకు పదిరోజుల పాటు సెలవులు రావడంతో పిల్లలు సంబరపడిపోతున్నారు.
    Published by:Sulthana Begum Shaik
    First published: