హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: ఏపీలో బ్యాంకుల మందు చెత్త.. బుగ్గనతో మాట్లాడానని అన్న నిర్మలా సీతారామన్

Andhra Pradesh: ఏపీలో బ్యాంకుల మందు చెత్త.. బుగ్గనతో మాట్లాడానని అన్న నిర్మలా సీతారామన్

బ్యాంక్‌ల ముందు చెత్త(Image-Twitter)

బ్యాంక్‌ల ముందు చెత్త(Image-Twitter)

ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య కార్మికులు చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. రుణాలివ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ఎదుట చెత్తపారవేశారు

ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య కార్మికులు చేసిన పని హాట్ టాపిక్‌గా మారింది. రుణాలివ్వడం లేదని పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ఎదుట చెత్తపారవేశారు. ఈ ఘటన గురువారం కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. విజయవాడలోని యూబీఐకు చెందిన మూడు శాఖలు, సింగ్ నగర్ ఎస్‌బీఐ, ఉయ్యూరులోని పలు బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు, మచిలీపట్నంలోని యూబీఐ శాఖల ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్త పోశారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఇబ్బందులు పడవాల్సి వచ్చింది. చివరకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది చెత్తను తొలగించారు. మరోవైపు గొల్లపూడిలో యూబీఐ బ్యాంకు ఎదుట పంచాయతీ సిబ్బంది చెత్తతో ఉన్న ట్రాక్టర్‌ను నిలిపారు. దీనిపై ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి.. బ్యాంకు మేనేజరుతో పాటు లబ్ధిదారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు.

"ప్రధానమంత్రి స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత వంటి వివిధ ప్రభుత్వ పథకాల కింద మాకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను పలు సందర్భాల్లో కోరాం. అధికారులు జోక్యం చేసుకున్న కూడా బ్యాంకర్ల నుంచి సానకూల స్పందన రాలేదు" పారిశుద్ద్య కార్మికులు తెలిపారు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల చర్యను బ్యాంకర్లు తప్పుబట్టారు. రుణాలు ఇవ్వడం లేదని బ్యాంకులపై నెపం వేయడం సరికాదని అన్నారు.



ఇక, ఈ సమస్యను బ్యాంక్ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమైనదని అన్నారు. ఇలా జరగాల్సి ఉండాల్సి కాదన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బ్యాంక్‌ల వద్ద చెత్త పారేసిన ఘటనపై గురువారం మధ్యాహ్నం 03.15 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో మాట్లాడినట్టు చెప్పారు. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు ఇబ్బంది కలిగించిన విషయాన్ని ఆయనతో చెప్పగా, తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారని ఆమె ట్విటర్‌లో పేర్కొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Krishna District

ఉత్తమ కథలు