ఇసుక తవ్వకాలు, రవాణాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ఇసుక తవ్వకాలు, రవాణా సరఫరా క్రమబద్ధీకరణలపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

  • Share this:
    నిర్మాణ రంగంలో అత్యంత కీలకమైన ఇసుకపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాలు, రవాణా సరఫరా క్రమబద్ధీకరణలపై తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుక తవ్వకాలు, లోడింగ్‌, సరఫరా, డోర్‌ డెలివరీకి వివిధ స్థాయిల్లో ధరలను నిర్ణయించింది. ఈ మేరకు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్‌ రీచ్‌లు, పట్టాదారు భూముల్లో ఇసుక తవ్వకానికి టన్నుకు రూ.90గా గనుల శాఖ నిర్ణయించింది. ఇక జేసీబీ ద్వారా ఇసుక లోడింగ్‌ రుసుము టన్నుకు రూ.25గా నిర్ధారించారు. దీంతో పాటు ఇసుక రవాణాకు కిలోమీటరుకు రూ.4.90 చొప్పున వసూలు చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

    ఇసుకకు రవాణాకు సంబంధించిన ఈ ధరలు 40 కిలోమీటర్ల దూరం వరకు వర్తిస్తాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. 40 కిలోమీటర్లు దాటితే ప్రతి టన్నుకు అదనంగా రూ.4.90ల చొప్పున వసూలు చేయనుంది. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణా టన్నుకు జీఎస్టీతో కలిపి కిలోమీటర్ రూ.3.30గా.. డోర్‌ డెలివరీ కోసం 10 కిలోమీటర్లలోపు దూరానికి ట్రాక్టర్‌ ద్వారా టన్నుకు రూ.10, లారీ ద్వారా టన్నుకు రూ.8, పెద్ద లారీకి టన్నుకు రూ.7 ప్రభుత్వం వసూలు చేయనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: