తెలంగాణ - ఏపీ సరిహద్దులో ఇసుక వివాదం.. తెరపైకి మరో సమస్య..

ఇప్పటి వరకు ట్రాక్టర్‌ ఇసుకకు చలానాగా రూ.1,300లు, లోడింగ్‌ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1,000 నుంచి రూ.1,500లు కలుపుకొని మొత్తం రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేసేవారు.

ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో చోటుచేసుకున్న సమస్య ఇప్పుడు అధికారుల దాకా వెళ్లింది.

 • Share this:
  ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో చోటుచేసుకున్న సమస్య ఇప్పుడు అధికారుల దాకా వెళ్లింది. అసలేం జరిగిందంటే.. ఏపీలోని కర్నూలు, తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మధ్య ఇసుక వివాదం ఇప్పుడు సమస్యగా మారింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో పారుతున్న తుంగభద్ర నదిలో ఇసుక లభిస్తోంది. ఈ నదిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సంబంధించి సగం సగం హక్కులు ఉన్నాయి. అయితే, ఏపీలోని కర్నూలు వాసులు తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై కర్నూలు, రాజోలి ప్రాంత వాసుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక పోలీసులు కర్నూలుకు చెందిన మూడు ట్రాక్టర్లను సీజ్‌ చేశారు. తాజాగా, చిన్న ధన్వాడలో ఏపీ నాయకులు ఇసుక ప్రాంతాల్లోకి వచ్చి తవ్వకాలు ప్రారంభించగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
  ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల అధికారులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలన చేపట్టారు. కర్నూలు నుంచి గనులు, భూగర్భ శాఖ అధికారులు, జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన గనులు, భూగర్భ అధికారులు నది మ్యాపులతో పరిశీలిన జరిపారు. చిన్నధన్వాడ, గుండ్రెవుల ప్రాంతాల్లో కర్నూలు వాళ్లకు నదిలో హక్కులు లేవని తెలంగాణ అధికారులు అనగా, ఉన్నాయని కర్నూలు అధికారులు వాదించారు. ఈ వివాదాన్ని తెరదించేందుకు రీ సర్వే చేపట్టాలని నిర్ణయించారు.

  ఇదిలా ఉండగా, ఏపీ, తెలంగాణ మధ్య జల జగడం మొదలయింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని సీఎం కేసీఆర్ అన్నారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమని అన్నారు. ఇప్పుడు ఈ వివాదం కూడా ఇరు రాష్ట్రాల మధ్య నడుస్తోంది.
  Published by:Shravan Kumar Bommakanti
  First published: