హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో నేటి నుంచి అమలు కానున్న సీఎం జగన్ నిర్ణయం..

ఏపీలో నేటి నుంచి అమలు కానున్న సీఎం జగన్ నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Sand Policy : ఏపీలో ఇసుక డోర్ డెలివరీ సదుపాయం నేటి నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఈ రోజు అమల్లోకి తీసుకురానున్నారు. మొదటగా కృష్ణా జిల్లాలో ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నారు.

ఏపీలో ఇసుక డోర్ డెలివరీ సదుపాయం నేటి నుంచే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఈ రోజు అమల్లోకి తీసుకురానున్నారు. మొదటగా కృష్ణా జిల్లాలో ఇసుకను డోర్ డెలివరీ చేయనున్నారు. ఇసుకను ప్రజల ఇంటి వద్దకే చేర్చేందుకు గానూ రవాణా సదుపాయాన్ని కూడా ఏపీఎండీసీనే తీసుకోనుంది. ఇసుక కావాలనుకున్నవాళ్లు నిర్మాణానికి సంబంధించిన వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచి, మ్యాప్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తే.. ఇసుక ఆ ప్రదేశానికి నేరుగా రానుంది. వినియోగదారులు బుకింగ్‌ కోసం అయ్యే ఖర్చు, రవాణా ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. 20 కిలోమీటర్ల దూరం వరకు టన్ను ఇసుకకు కిలోమీటరుకు రూ.6.60 రవాణా ఛార్జీ చెల్లించాలి. 30 కిలోమీటర్ల దూరం అయితే కిలోమీటరుకు రూ.6, 30 కిలోమీటర్లకుపైన అయితే కిలోమీటరుకు రూ.4.90 చొప్పున ఛార్జీ చేయనున్నారు.

కాగా, జనవరి 7న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీలు చేయనున్నారు. ఆ తర్వాత జనవరి 20లోపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను అమలు చేయాలని సీఎం జగన్ సంకల్పించారు. ఏపీలో ఇసుక కొరత అధిగమించేందుకు ఎంతగానే ప్రయత్నించిన సీఎం జగన్... ఆ తరువాత ఇసుకను సామాన్యులకు అందించే అంశంపై శ్రద్ధ పెట్టారు. దీంతో ఈ నిర్ణయానికి సీఎం పచ్చ జెండా ఊపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap new sand policy

ఉత్తమ కథలు