Home /News /andhra-pradesh /

SAMABARA POLAMABAA JATARA SIRIMANOTSAV SAMBARAM CELBRATES VERY GRAND IN VIZIANAGARAM DISTRICT NGS VZM

Sambara Jataraj: గిరి దేవత శంబర పోలమాంబ.. సిరిమానోత్సవానికి పోటెత్తిన భక్తులు..

సంబర జాతర

సంబర జాతర

Sambara Jatara: గిరి దేవత.. మన్యం వాసుల ఇలవేల్పు సంబర పోలమాంబ సిరిమానోత్సవం సందడిగా సాగింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిని కొలిచేందుకు లక్షలాదిగా భక్తులు ఎగబడ్డారు..

    Sambara Polamamba Jatara:  ఉత్తరాంధ్ర కొంగు బంగారం.. గిరి దేవత, మన్యం వాసుల ఇలవేలుపు, గణపతుల ఆడపడుచైన శంబర పోలమాంబ సిరిమానోత్సవం ఘనంగా ముగిసింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అయిన శంబర పోలమాంబ (Sambara Polamamba)గా.. విజయనగరం జిల్లా (Vizianagaram) మక్కువ మండలం శంబరలో భాసిల్లుతున్న పోలమాంబ అమ్మవారి సిరిమానోత్సవం (Sririmanothavam) ప్రతిఏటా.. సంక్రాంతి (Sankranthi) తరువాత వచ్చే రెండో మంగళవారం  ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాక పక్కనున్న ఒడిసా, చత్తీస్ఘడ్ రాష్ట్రాల నుండి వచ్చే లక్షల మంది భక్తులతో శంబర జాతర ప్రతిఏటా కనుల పండుగగా జరుగుతుంది. కరోనా వైరస్ (Corona Virus) విస్తరిస్తున్న  నేపథ్యంలో అధికారులు ఆంక్షలు విధించినప్పటికీ, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలమాంబ సిరిమాను జాతరకు లక్షలాది మంది రావటంతో శంబర జనసంద్రంగా మారింది.

    ఉత్తరాంధ్రలో ప్రముఖంగా జరిగే సిరిమానోత్సవ కార్యక్రమమైన విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం తర్వాత, శంబర పోలమాంబ సిరిమానోత్సవం రెండో స్థానం దక్కుతుంది.  సంక్రాంతి తరువాత వసంత పంచమి మరుసటి రోజున ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరిగింది. ప్రత్యేక అలంకరణ, పూజాది కార్యక్రమాలతో అనంతరం సాయంత్రం మూడు గంటలకు సిరిమానోత్సవాన్ని ప్రారంభించారు.

    ఇదీ చదవండి : ఆహా ఏమి రుచి అనిపించే తందూరీ టీ.. ఎలా తయారు చేస్తారో తెలుసా..?

    ఈసారి జన్నిపేకాపు భాస్కరరావు సిరిమానును అధిరోహించారు. ఆనవాయితీ ప్రకారం సాడేపు వంశస్థులు పూజారి జన్నిపేకాపు భాస్కరరావు ను తమ భుజాలపై మోసుకుంటూ తీసుకొచ్చారు.  మంగళ వాయిద్యాల మధ్య ఘటాలు సిరిమాను దగ్గరకు చేరుకోగా.. పూజారి జన్నిపేకాపు భాస్కరరావు సిరిమానును అధిరోహించారు.

    ఇదీ చదవండి : : ఆ మూడూ చేయండి. మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్

    సిరిమాను ఉత్సవం ప్రారంభమయ్యాక.. తొలుత సిరిమాను గిరడ వారింటికి, అనంతరం కుప్పిలి వారి ఇల్లు, పూడి వారిళ్లకు వెళ్లి సిరిమాను పూజలందుకుంది.  ఘటాలు దక్షిణ దిక్కుగా, సిరిమాను తూర్పు దిక్కుగా  వెళతాయి. ఈ రెండు పణుకు వీధిలో కలిసాయి. అక్కడ పొడిపిరెడ్డి కుటుంబీకులు, తీళ్ల వారి వారసులుగా ఉన్న అక్యాన కుటుంబీలు ప్రత్యేక పూజలు చేసారు. తరువాత సిరిమాను వెనక్కు మళ్లి  గ్రామంలోని ప్రధాన వీధులైన పనుకువీధి, గొల్లవీధి, కొత్తవీధి మీదుగా పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి.. అక్కడ భక్తుల నుంచి పూజలు అందుకుంటుంది.

    ఇదీ చదవండి : శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవాలి అంటే ఇకపై ఆన్ లైన్ బుకింగ్.. ఇలా చేసుకోండి

    తిరిగి సిరిమాను యాత్ర స్థలమైన నడివీధికి చేరుకొన్న తరువాత సిరిమానోత్సవం ముగిసింది. అక్కడ సాడేపు కుటుంబీలు మళ్లీ జన్ని పేకాపు భాస్కరరావు (జగది)ను సిరిమాను నుంచి కిందకు దించి భుజాలపై చదురుగుడికి తీసుకు వెళతారు.

    ఇదీ చదవండి : సినిమా స్టైల్లో ఛేజింగ్.. ఏపీలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం..

    శక్తి స్వరూపిణి అయిన పోలమాంబ పూజారి రూపంలో గ్రామ వీధుల్లో సిరిమాను రధంపై దర్శనమివ్వటంతో., భక్తులు భక్తిపారవశ్యం పొందారు. సిరిమాను అధిరోహించిన పూజారికి అరటిపళ్లు., కొబ్బరికాయలు, చీరలు తాకించి మొక్కులు తీర్చుకున్నారు. ఏ రూపంలో ఉన్న కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన పోలమాంబను సిరిమాను రూపంలో దర్శించుకుని., ముక్తిపొందారు భక్తులు. రెండు గంటల పాటు జరిగిన సిరిమాను సంబరాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరావటంతో., శంబర జనసంధ్రంగా మారింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Vizianagaram

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు