SAJJALA RAMAKRISHNA REDDY ON PRC AND EMPLOYEES STRIKE HE SAID GOVERNMENT READY TO MEET WIHT EMPLOYEES NGS
Sajjala: ఉద్యోగులను సమ్మెకు వెళ్లనీయం.. నాలుగు మెట్లుదిగేందుకు సిద్ధం
ఉద్యోగులు సమ్మెకు వెళ్లరు
Sajjala On Employees Strike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఓ వైపు సమ్మెకు సై అంటున్నారు.. ఆరు నూరైనా.. కచ్చితంగా నిరవధిక సమ్మె తప్పదంటున్నారు..? కానీ ప్రభుత్వం మాత్రం సమ్మెకు వెళ్లనీయమంటోంది.. అవసరమైతే నాలుగు మెట్లు దిగడానికి కూడా సిద్దమంటోంది..?
Sajjala Ramakrishna Reddy on Employees Strike: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఉద్యోగుల సమ్మె కు (AP Employees Strike) బ్రేకులు పడతాయా..? ఈ నెల 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు కనీసం చర్చలకు కూడా వెళ్లేది లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. డిమాండ్లు నెరవేర్చండి.. తరువాత చర్చలు.. అప్పుడు వరకు మాట్లాడుకోవడాల్లేవ్ అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. ఇందులో భాగంగా ముచ్చటగా మూడోసారి కూడా ప్రభుత్వ కమిటీకి ఎదురుచూపులు తప్పలేదు.. ఇవాళ చర్చలకు ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తాయని మంత్రుల కమిటీ ఎదురు చూసింది. కానీ రొటీన్ గా ఉద్యోగ సంఘాలు.. డిమాండ్లు నెరవేర్చేకే చర్చలకు పిలవండని తేల్చి చెప్పేశాయి. దీంతో గంటల తరబడి సచివాలయంలో వెయిట్ చేసిన మంత్రుల కమిటీ.. ఇక లాభం లేదని బయటకు వచ్చేసింది. ఈ పరిస్థితి చూస్తుంటే ఉద్యోగులు తగ్గేదే లే అంటున్నారన్న విషయం అర్థమవుతోంది. సమ్మె తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి...
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల (SAjjala Rama Krishna Reddy) మాత్రం ఉద్యోగులను సమ్మెకు వెళ్లనీయకుండా అడ్డుకుంటామంటున్నారు.. ఎందుకంటే ఉద్యోగులతో తమకు శత్రుత్వం లేదన్నారు. వారు ప్రభుత్వంలోనే భాగమే అని గుర్తు చేశారు. వారికి అన్ని విధాల మేలు చేసేందుకే తమ కమిటీ ఉంది. అన్నారు. కొత్ పీఆర్సీ (PRC)పై ఎవరికైనా అనుమానాలు ఉంటే.. వారితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అసలు చర్చలకు వస్తే సమస్య ఉండదని హామీ ఇస్తున్నారు..
ఈ నెల జీతలు పడితే.. ప్లే సిప్పులో జీతం పెరిగిందా.. తగ్గిందా అన్నది తేలిపోతుంది అన్నారు సజ్జల. పీఆర్సీ సాధన కమిటీకి చర్చలకు రావడానికి ఇష్టం లేకపోతే.. ఉద్యోగ సంఘాల తరపున ఎవరు వచ్చినా తాము అన్ని వివరాలు సానుకూలంగా వివరిస్తామంటున్నారు. పీఆర్సీ విషయంలో నెలకొన్న గందరగోళ తొలగించడమే తమ కమిటీ ఉద్దేశమని.. అలాంటప్పుడు ఉద్యోగ సంఘాలకు చర్చలే సరైన మార్గం అన్నారు. ఒకటి రెండు రోజుల్లోనే అని విషయాలు సర్దుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఉద్యోగుల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నామన్నారు..
ఉద్యోగుల సమస్యలపై చర్చిందేకు.. పీఆర్సీపీ పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు రేపటి నుంచి 12 గంటల పాటు అందుబాటులో ఉంటామని సజ్జల హామీ ఇచ్చారు.. ఉద్యోగ సంఘాల నేతలు వచ్చి.. వారి అనుమానాలు తొలగించుకోవాలి అన్నారు. ఆ చర్చల్లో వారి వాదన నిజమని తేలితే కచ్చితంగా ప్రభుత్వం పీఆర్సీ విషయంలో సవరణలు చేసేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు. మరి తాజా మంత్రుల హామీలపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.. చర్చలకు ముందుకు వస్తాయా... లేదా ఎప్పటిలాగే మాట్లాడుకోవడాల్లేవని.. సమ్మెకే సై అంటారా అన్నది చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.