వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(YS vivekananda reddy murder case) సీబీఐ దర్యాప్తు వేగం పెరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా విచారించారు. వివేకా హత్య అనంతరం ఎంపీ అవినాశ్ రెడ్డి(YS Avinash Reddy) నుంచి కాల్స్ అందుకున్నట్టుగా భావిస్తున్న సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్‌లను సీబీఐ నేడు విచారించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అవినాశ్ రెడ్డి తర్వాత నవీన్ ను నోటీసులు ఇచ్చారని, దాంతో నవీన్ ఎవరోనంటూ ఓ వర్గం మీడియా అసత్యాలు ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. హత్య విషయం మొదటగా తెలిసింది వివేకా అల్లుడు, బావమరిదికేనని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
వివేకా హత్యకు గురైన విషయం ఆయన బావమరిది ద్వారా అవినాశ్ రెడ్డికి తెలిసిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని వైఎస్ జగన్‌కు చెప్పేందుకే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌లకు అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి ఉంటాడని తెలిపారు. జగన్‌కు ఫోన్ ఉండదని.. అందుకే ఈ విషయం చెప్పేందుకు వారికి ఫోన్ చేసి ఉంటారని తెలిపారు. చంద్రబాబుకు ఏదైనా విషయం చెప్పాలంటే.. ఎవరో ఒకరికి ఫోన్ చేయాల్సిందే కదా అని సజ్జల వ్యాఖ్యానించారు. వివేకా మృతి అనుమానాస్పదంగా ఉందని అనిపించినా.. వివేకా అల్లుడు, బావమరిది ఎందుకు పోలీసులకు సమాచారం అందించలేదని ప్రశ్నించారు.
అంతకుముందు వివేకాహత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్‌లను సీబీఐ విచారించింది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో ఆరు గంటలకు పైగా సీబీఐ విచారణ జరిగింది. మొదట కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు, ఆ తర్వాత నవీన్‌ను ప్రశ్నించింది. ఎంపీ అవినాశ్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా వీరిద్దరినీ ప్రశ్నించి సమాచారం సేకరించే ప్రయత్నం చేశారు. విచారణ ముగిసిన అనంతరం కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ విజయవాడ వెళ్లిపోయారు.
Srisailam: శివరాత్రి బ్రహోత్సవాలకు శ్రీశైలం వెళ్లే శివభక్తులకు శుభవార్త..
Tarakaratna Health Updates: తారకరత్నను విదేశాలకు తరలిస్తారా ?.. టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
వివేకా హత్య జరిగిన తర్వాత అవినాశ్ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ ఆధారంగా కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.