విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం.. హిందూ సంఘాల ఆగ్రహం

శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

news18-telugu
Updated: September 16, 2020, 10:28 AM IST
విజయవాడలో సాయిబాబా విగ్రహం ధ్వంసం.. హిందూ సంఘాల ఆగ్రహం
శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
  • Share this:
ఏపీలో ఆలయాల చుట్టూ వివాదం ముదురుతోంది. విజయవాడ దుర్గగుడి రథంలో బంగారు సింహాలు మాయమైన ఘటనపై ఇప్పటికే దుమారం రేగుతోంది. ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో సాయిబాబా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీ షిర్డీసాయిబాబా మందిరం బయట నెలకొల్పిన బాబా విగ్రహాన్ని విరగగొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు సీఐ సురేష్ రెడ్డి సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. వెంటనే పాడైన విగ్రహం స్ధానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగింది. ఉత్సవాల్లో వినియోగించే వెండి రథం సింహాల్లో మూడు మాయమయ్యాయి. మొత్తం నాలుగు సింహాలకు గాను ఒక్కటే మిగిలి ఉంది. దానిని కూడా పెకిలించేందుకు ప్రయత్నించి విఫలమయినట్లు తెలిసింది. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండి వినియోగించారు. ఈ లెక్కన రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి అదృశ్యమైంది. అంతర్వేది రథం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌ ఆలయ రథాన్ని పరిశీలించగా వెండి సింహాలు మాయమైన విషయం తెలిసింది.
Published by: Shiva Kumar Addula
First published: September 16, 2020, 10:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading