హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

గుంటూరులో దారుణం.. ప్రియురాలి హత్య.. బ్లేడుతో గొంతుకోసిన ప్రేమోన్మాది

గుంటూరులో దారుణం.. ప్రియురాలి హత్య.. బ్లేడుతో గొంతుకోసిన ప్రేమోన్మాది

ప్రతీకాత్మక చిత్రం (News18 File Photo)

ప్రతీకాత్మక చిత్రం (News18 File Photo)

అప్పటివరకూ ప్రాణంగా ప్రేమిస్తారు. నువ్వు లేనిదే నేను లేను అంటారు. నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తా అంటారు.. అలాంటిది సడెన్‌గా సైకోలవుతారు. ప్రాణం తీస్తారు. ఇలా ఎన్నో ఘటనలు. తాజాగా మరొకటి. ఈ దారుణానికి గుంటూరు సాక్ష్యమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో రోజూ రకరకాల ప్రేమోన్మాదుల దారుణాలు చూస్తూనే ఉన్నాం. బాధితుల పట్ల అయ్యో పాపం అనుకుంటున్నాం. కానీ వీటికి బ్రేక్ పడట్లేదు. డైలీ సీరియల్ లాగా జరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్.. గుంటూరు జిల్లాలో తాజాగా మరో ఉదంతం. పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలిని బ్లేడుతో గొంతు కోసి చంపాడో ప్రేమ ఉన్మాది. జిల్లాలోని పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఈ దారుణం జరిగింది.

ఎందుకిలా?

కృష్ణా జిల్లా .. పమిడిముక్కల మండలం.. కృష్ణాపురానికి చెందిన తపస్వి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు కృష్ణా జిల్లా.. ఉంగుటూరు మండలం మానికొండకు చెందిన జ్ఞానేశ్వర్‌.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మాటలు కలిశాయి. స్నేహం మొదలై.. ప్రేమగా మారింది. తపస్వి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో BDS థర్డ్ ఇయర్ చదువుతోంది. జ్ఞానేశ్వర్‌ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌. వీరిద్దరూ కొన్నాళ్లు గన్నవరంలో ఉన్నారు. ఆ సమయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఓసారి అతనిపై కృష్ణా జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది.

పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇకపై ఆమె జోలికి వెళ్లను అన్నాడు. కానీ తీరు మార్చుకోలేదు. తరచూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. దాంతో తపస్వి తక్కెళ్లపాడులోని తన స్నేహితురాలికి విషయం చెప్పుకుంది. ఆ స్నేహితురాలు.. అతనితో ఓసారి మాట్లాడదాం అని చెప్పి.. జ్ఞానేశ్వర్‌‌ని తన ఇంటికి పిలిపించింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని స్నేహితురాలి ఇంటి పై అంతస్థులో డిస్కషన్. మళ్లీ మామూలే. అప్పుడు కూడా జ్ఞానేశ్వర్‌ తనను పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేశాడు.

తపస్వి.. తాను మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. అంతే.. జ్ఞానేశ్వర్‌‌లో రాక్షసుడు బయటకు వచ్చాడు. ఒక్కసారిగా జేబులోంచీ బ్లేడ్ తీసి.. ఆమె గొంతు కోసేశాడు. అది చూసిన స్నేహితురాలు.. బాబోయ్ అంటూ.. గట్టిగా అరుస్తూ.. పై అంతస్తు నుంచి కిందకు పరుగులు పెట్టింది. ఇంటి యజమానికి చెప్పి పైకి తీసుకెళ్లింది. అప్పటికే ఆమెను మరో గదిలోకి ఈడ్చుకెళ్లి.. తలుపులు మూసేసిన జ్ఞానేశ్వర్‌.. దారుణాన్ని కంటిన్యూ చేశాడు.

స్పృహ కోల్పోయిన తపస్విని గొంతుపై అదేపనిగా గాయపరిచాడు. స్థానికులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అతన్ని బంధించి.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఆ పరిస్థితుల్లో జ్ఞానేశ్వర్‌.. బ్లేడ్‌తో తన చేతిపై గాయం చేసుకుని సూసైడ్ చేసుకోబోయాడు. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తపస్వి చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ముంబైలో ఉంటున్నారు. వారికి సమాచారం ఇచ్చిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Crime news, Murder

ఉత్తమ కథలు