Sabarimala: శబరిమల వెళ్తే చేయకూడని పనులివే...

Sabarimala | మీరు శబరిమలలో ఏ సేవలు పొందినా అదనంగా ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: November 25, 2019, 6:17 PM IST
Sabarimala: శబరిమల వెళ్తే చేయకూడని పనులివే...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లే సీజన్ మొదలైంది. ఇప్పటికే వేలాదిమంది భక్తులు శబరిమల వెళ్లివస్తున్నారు. అయితే శబరిమల వెళ్తే ఏం చేయకూడదో, ఏం చేయాలో ఆలయ బోర్డు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. శబరిమల వచ్చే అయ్యప్ప భక్తులు స్వయంగా ఇబ్బంది పడకుండా, ఇతరులను ఇబ్బందులకు గురి చేయకుండా ఎలా వ్యవహరించాలో కొన్ని సూచనలు చేసింది. శబరిమల ఆలయ ప్రాంగణంలో ఎట్టిపరిస్థితుల్లో మొబైల్ ఫోన్స్ ఉపయోగించకూడదు. ఇతర ఆలయాల్లోనూ ఇదే నియమం వర్తిస్తుంది. పంబ, సన్నిధానంతో పాటు దారిలో ధూమపానం నిషేధం. ఆల్కహాల్, డ్రగ్స్ సేవించకూడదు. క్యూలైన్‌లో ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లో హడావుడి పడొద్దు. దీనివల్ల ఇతర భక్తుల్లో గందరగోళానికి కారణమవుతుంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, వంట గ్యాస్, స్టవ్ వెంట తీసుకెళ్లకూడదు. అనధికారికంగా ఎవరైనా ఏవైనా వస్తువులు, ప్రసాదం అమ్మితే వారి నుంచి కొనకూడదు. ప్రభుత్వం, ఆలయ బోర్డు ఏర్పాటు చేసిన టాయిలెట్స్ మాత్రమే ఉపయోగించాలి. పరిసరాలను అపరిశుభ్రం చేయకూడదు.

మీరు శబరిమలలో ఏ సేవలు పొందినా అదనంగా ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డోలి సేవలు పొందినట్టైతే దేవస్థానం కౌంటర్ దగ్గర పేమెంట్ చేసి రిసిప్ట్ తీసుకోవాలి. సెక్యూరిటీ చెక్ పాయింట్స్ దగ్గర తనిఖీలకు సహకరించాలి. ఏదైనా సాయం కావాల్సి వస్తే పోలీసుల్ని సంప్రదించడానికి వెనకాడాల్సిన పనిలేదు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. చెత్తను చెత్తబుట్టలోనే వేయాలి. ఎక్కడపడితే అక్కడ పారేయకూడదు. ఇక నడిచేప్పుడు ప్రతీ 10 నిమిషాలకోసారి 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. మరకూట్టం, సారంకూతి, నడపంతాల్ మార్గంలోనే సన్నిధానానికి చేరుకోవాలి. మెట్ల దగ్గర క్యూపద్ధతి పాటించాలి. 18 మెట్లపై కొబ్బరికాయలు కొట్టకూడదు. సూచించిన ప్రదేశంలోనే కొబ్బరికాయలు కొట్టాలి. మెట్లు ఎక్కేప్పుడు మోకాళ్లపై వంగకూడదు. శబరిమల నుంచి తిరిగి వెళ్లే సమయంలో నడపంతాల్ ఫ్లైఓవర్ మాత్రమే ఉపయోగించాలి. ఇక ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే ఆరోగ్య కేంద్రాల సేవలను ఉపయోగించుకోవాలి. అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్‌తో మీ ఐడీకార్డులను మెడలో వేసుకోవాలి. మీ బృందంలో ఎవరైనా తప్పిపోతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

మార్కెట్‌లోకి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ 5ఎస్ ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Sabarimala: శబరిమల వెళ్తున్నారా? డిసెంబర్ 26న ఆలయం మూసివేత

Sabarimala Special Trains: తెలంగాణ, ఏపీ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలు, టైమింగ్స్ ఇవేSabarimala: శబరిమల వెళ్తున్నారా? ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేయండి ఇలా
Published by: Santhosh Kumar S
First published: November 25, 2019, 6:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading